Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాను త‌ప్పించి ఆమెని దించేసారు!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కథానాయ‌కుడిగా న‌టించిన `జైల‌ర్` లో `కావాల‌య్యా` అంటూ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఏ రేంజ్లో ర‌చ్చ చేసిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   17 Dec 2025 8:15 AM IST
త‌మ‌న్నాను త‌ప్పించి ఆమెని దించేసారు!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కథానాయ‌కుడిగా న‌టించిన `జైల‌ర్` లో `కావాల‌య్యా` అంటూ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఏ రేంజ్లో ర‌చ్చ చేసిందో తెలిసిందే. సినిమా అంతా ఒక ఎత్తైతే? ఒక్క పాట‌తో త‌మ‌న్నా సినిమాకే హైలైట్ గా నిలిచింది. అంద‌చందాల‌తో..ఒంపుసొంపుల‌తో కుర్ర‌కారు మ‌తులు చెడగొట్టింది. మ‌రి అలాంటి హాట్ ఐటం నెంబ‌ర్ `జైల‌ర్ 2` లో ఉందా? ద‌ర్శ‌కుడు నెల్స‌న్ ఆ ఛాన్స్ తీసుకున్నాడా? అంటే నో డౌట్ అనే తెలుస్తోంది. పార్ట్ 2 లో ఐటం పాట కోసం ఏకంగా బాలీవుడ్ హాట్ సెరైన్ నోరా ప‌టేహీనే రంగంలోకి దించారు.

ఇప్ప‌టికే పాట షూటింగ్ కూడా మొద‌లైపోయింద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నోరా ప‌టేహీప్రస్తుతం చెన్నైలో ఉంది. ఔట్ డోర్ లో ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇది ప‌క్కా సౌత్ స్టైల్ ట్రాక్. యువ సంచ‌ల‌నం అనిరుద్ మాస్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయ్యే ట్యూన్ ఇచ్చాడు. త‌మ‌న్నాను మించి నోరా ప‌టేహీ ట్రీట్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఈ పాట కేవలం నోరా ప‌టేహీకి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌లేదు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా పాట‌లో జాయిన్ అవుతున్నారు. ఈ పాట‌కు సంబంధించినో రా ప‌టేహీ ఎనిమిది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటుంది.

`జైల‌ర్` లో `కావాల‌య్యా` పాట‌కు ప్ర‌త్యేక‌మైన సెట్ వేసారు. అందుకోసం భారీగా ఖ‌ర్చు చేసారు. ఆ పాట‌లో ప్ర‌తీ ప్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది. తాజా పాట‌కు మాత్రం అలాంటి సెట్లు ఏవీ వేయ‌కుండా ఔట్ డోర్ లో షూట్ చేయ‌డం విశేషం. మ‌రి ఈ పాట వెనుక కాన్సెప్ట్ ఏమై ఉంటుందో చూడాలి. త‌మ‌న్నా న‌టించిన పాట‌కు కోట్ల‌లో వ్యూస్ వ‌చ్చాయి. లిరికల్ గానే పాట శ్రోత‌ల‌కు రీచ్ అయింది. వీడియో సాంగ్ రిలీజ్ అనంత‌రం మ‌రింత పాపుల‌ర్ అయింది. నోరా ప‌టేహీ సాంగ్ అంత‌కు మించి స‌క్సెస్ అవ్వాలి. చివ‌రిగా నోరా `థామా`లో స్పెష‌ల్ సాంగ్ తో అల‌రించింది.

మూడేళ్ల త‌ర్వాత చేసిన ఐటం సాంగ్ అది. కానీ థామా అనుకున్నంతగా స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో నోరా ఎఫెర్ట్ కూడా వృద్ధా ప్ర‌య‌త్న‌మే అయింది. ప్ర‌స్తుతం న‌టిగా రెండు సినిమాలు చేస్తోంది. క‌న్న‌డ‌లో `ది డెవిల్`, త‌మిళ్ లో `కాంచ‌న 4` లో న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల‌పై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది. తెలుగులో `మ‌ట్కా` చిత్రంలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.