Begin typing your search above and press return to search.

నోరా కిల్లింగ్ లుక్: కాసులు, నాణేలతో ఒళ్లంతా సింగారం

గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన సరికొత్త ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   12 May 2026 11:29 PM IST
నోరా కిల్లింగ్ లుక్: కాసులు, నాణేలతో ఒళ్లంతా సింగారం
X

గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన సరికొత్త ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ''నీ ఒళ్లు బంగారం కాను..!'' అనేలా మెరిసిపోతున్న ఆ దివ్య‌మైన రూపం అభిమానుల కళ్లను తిప్పుకోనివ్వడం లేదు. భారతీయ సంప్రదాయ ఆభరణాలు... ఉత్తర ఆఫ్రికా సంస్కృతుల అరుదైన కలయికతో రూపొందించిన ఈ లుక్ నోరా కెరీర్‌లోనే అత్యంత ప్రయోగాత్మకమైన.. అందమైన ఫోటోషూట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.





ఈ ఫోటోషూట్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఒక `జల దేవత` రూపానికి ప్రాణం పోయడం. ఇందులో భాగంగా నోరా శరీరం నిండా బంగారు కాసులు, నాణేలతో కూడిన ఆభరణాల దుస్తుల‌ను డిజైన్ చేయించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ గోల్డ్ జ్యువెలరీ ఈ బ్యూటీకి ఒక రాజసం ఉట్టిపడే భారతీయ సౌందర్యాన్ని అందించింది. నోరా నిజంగా ఒక దేవతలా వెలిగిపోతోంది.





కేవలం భారతీయతకే పరిమితం కాకుండా.. ఈ లుక్‌లో నోరా తన మూలాలను కూడా ప్రతిబింబించింది. మొరాకోకు చెందిన `అమాజిగ్ బెర్బర్` సంస్కృతికి చెందిన బాడీ టాటూలను ఇందులో జోడించారు. ఈ టాటూలు, బంగారు ఆభరణాల కలయిక భారత్ - మొరాకో అనే రెండు భిన్నమైన ప్రపంచాల అద్భుతమైన సమ్మేళనంలా కనిపిస్తోంది. ఈ `ఫ్యూషన్` స్టైల్ నోరా ఫ్యాషన్ సెన్స్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.





నోరా ఫతేహి తన ఫిట్‌నెస్ - గ్రేస్‌తో ఈ లుక్‌కు పూర్తి న్యాయం చేసింది. కేవలం డ్యాన్స్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రయోగాల్లోను తనే `క్వీన్` అని చాటుకుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు నోరా అందానికి .. ఆ వినూత్న ఆలోచనకు ఫిదా అయిపోతున్నారు.