Begin typing your search above and press return to search.

ప్రేమలో పడ్డ బాహుబలి బ్యూటీ.. అబ్బాయి ఎవరంటే?

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి.

By:  Madhu Reddy   |   13 Jan 2026 11:05 AM IST
ప్రేమలో పడ్డ బాహుబలి బ్యూటీ.. అబ్బాయి ఎవరంటే?
X

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి. ఈ సినిమాలో "మనోహరీ" అనే పాటతో ఎవర్గ్రీన్ బ్యూటీగా పేరు దక్కించుకుంది నోరా ఫతేహి . తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో శరీరాన్ని విల్లులా వంచేసి, డాన్స్ అంటే ఇలా ఉండాలి అని అందరి చేత అనిపించేలా ఆకట్టుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. ఇక నిత్యం తన అందంతో అభిమానులను ఉర్రూతలూగించే ఈ బాలీవుడ్ భామ తాజాగా డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

డాన్సింగ్ క్వీన్ గా పేరు దక్కించుకున్న నోరా ఫతేహి తాజాగా మొరాకోకు వెళ్ళింది. AFCON 2025 ఫుట్బాల్ మ్యాచ్ ను చూడడానికి వెళ్లి ఈమె అక్కడ సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో అక్కడి జెర్సీతో పాటు చేతిలో జెండా పట్టుకుని కెమెరాకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు మొరాకన్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అచ్రఫ్ హకిమితో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. మ్యాచ్ సందర్భంగా మొరాకో టీం విజయం సాధించాలని ప్రార్థించడమే కాకుండా నోరాఫతేహి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ను అచ్రఫ్ లైక్ చేయడం వంటి విషయాలతో అసలు విషయం బయటపడింది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అభిమానులు కూడా అంచనాకి వస్తున్నారు.

ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ డేటింగ్ రూమర్లపై రానున్న రోజుల్లో వీరి నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. నోరా ఫతేహి విషయానికొస్తే.. ద టు నైట్ షో అమెరికన్ టెలివిజన్ డెబ్యూ ఇచ్చిన ఈమె ప్రస్తుతం హారర్ ఎంటర్టైనర్ గా వస్తున్న కాంచన 4 లో కూడా నటిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

నోరా ఫతేహి కెరియర్ విషయానికి వస్తే.. రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ తో తన నటన రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఇండియన్ చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. బాహుబలి సినిమా కంటే ముందు టెంపర్ సినిమాలో ఆకట్టుకుంది. ఆ తర్వాత కిక్ 2 చిత్రంలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి తెలుగు ప్రజల ఆదరణ సొంతం చేసుకుంది.ఇక తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళం చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.అలాగే 2015లో రియాలిటీ షో బిగ్ బాస్ లో పోటీదారుగా పాల్గొనింది. ఇక ఇలా ఇప్పుడు డేటింగ్ వార్తలతో వైరల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి దీనిపై ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.