Trending - అనిల్ ఈసారి కూడా దొరకలేదు..!
అనిల్ రావిపూడి ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తున్న పేరు. మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు సినిమా తీశాడు అనిల్ రావిపూడి.
By: M Prashanth | 12 Jan 2026 11:55 AM ISTఅనిల్ రావిపూడి ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తున్న పేరు. మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు సినిమా తీశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా నిన్న ఈవెనింగ్ ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పటాస్ నుంచి మన శంకర వరప్రసాద్ వరకు చేసిన 9 సినిమాలు కూడా సక్సెస్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి సినిమాల్లో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉంటాయి. అందులో పెద్దగా కథ లేకుండానే అతని సినిమాలు ఉంటాయన్నది ప్రధానమైంది.
ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్..
అనిల్ రావిపూడి సినిమాల్లో కథ అంత గొప్పగా ఉండదు. ఐతే రాసుకున్న కథనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా తీర్చిదిద్దుతాడు. అందులో ఆయన మాస్టర్ అనిపించుకున్నాడు. చిన్న కథ రాసుకుని దాని చుట్టూ అనిల్ రావిపూడి రాసుకునే స్క్రీన్ ప్లే కాస్టింగ్ ఎంపిక ఇవన్నీ అడ్వాంటేజ్ గా మారి సినిమాను సక్సెస్ చేస్తుంటాయి.
గొప్ప కథ లేకుండానే అనిల్ సక్సెస్ అందుకుంటాడని ఏదో ఒకరోజు దొరికేస్తాడని కొందరు నెటిజన్లు అనిల్ రావిపూడి పై కామెంట్స్ చేస్తారు. కానీ అనిల్ రావిపూడి వాళ్లకి ఎప్పుడు దొరకలేదు. మన శంకర వరప్రసాద్ సినిమా విషయంలో కూడా అనిల్ రావిపూడి దొరికేస్తాడని అనుకోగా మెగా ఫ్యాన్స్ కి మరోసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసి సూపర్ హిట్ కొట్టాడు.అందుకే ఈసారి కూడా అనిల్ రావిపూడి దొరకలేదని అంటున్నారు.
డైరెక్టర్ గా అనిల్ కి ఒక సెపరేట్ స్టైల్ ఉంది. లైటర్ వే లోనే కథ చెబుతూ ఎక్కువగా ఎంటర్టైనింగ్ మోడ్ లోనే స్క్రీన్ ప్లే నడిపిస్తాడు. టికెట్ కొన్న ఆడియన్ ని ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. అందుకే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అనిల్ రావిపూడి తెలివైన స్క్రీన్ ప్లే.
మన శంకర వరప్రసాద్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసి ఈసారి అనిల్ రావిపూడి కచ్చితంగా దొరికేస్తాడని అనుకున్నారు. కానీ తన తెలివైన స్క్రీన్ ప్లే.. తనకు చాలా బలంగా తెలిసిన ఎంటర్టైనింగ్ తో మెగా మూవీని బాస్ ఫ్యాన్స్ కి నచ్చేలా చేశాడు.
ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి ఎనర్జీ టైమింగ్ ఫ్యాన్స్ కి మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకునేలా చేశాడు. అందుకే మన శంకర వరప్రసాద్ తో మరోసారి అనిల్ తన స్ట్రెంత్ ఏంటో చూపించాడు.
ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్ కూడా మెప్పించేలా..
ట్విస్టులు, టర్న్ లు లేకుండా బ్రెయిన్ కి పెద్దగా స్ట్రెస్ ఇవ్వని కథ కాకుండా ఒక సింపుల్ స్టోరీతో అనిల్ రావిపూడి చేసే ఈ ప్రయత్నాలు సక్సెస్ ఫుల్ రిజల్ట్ ని అందిస్తున్నాయి. ఒక సినిమాను ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్ ని కూడా మెప్పించేలా చేస్తేనే ప్రస్తుతం ఉన్న టైంలో నిజమైన సక్సెస్ అవుతుంది. ఆ విషయంలో అనిల్ రావిపూడి మరోసారి తన బలాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో తను అనుకున్న కథతో ఎంటర్టైన్ చేసే స్క్రీన్ ప్లే తో సంక్రాంతికి థియేటర్ లో పండగ వాతావరణాన్ని తెచ్చాడు. సినిమా చూసే ఆడియన్స్ లాజిక్ లు పట్టించుకోకుండా అనిల్ రావిపూడి చేసే మ్యాజిక్ చూసి సూపర్ అనేస్తున్నారు.
