Begin typing your search above and press return to search.

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు 'నో ఎంట్రీ'... రాజమౌళి హెచ్చరిక!

పాన్ ఇండియా లెవెల్‌లో మహేష్ బాబు రాజమౌళి SSMB29 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే.

By:  M Prashanth   |   13 Nov 2025 12:58 PM IST
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ... రాజమౌళి హెచ్చరిక!
X

పాన్ ఇండియా లెవెల్‌లో మహేష్ బాబు రాజమౌళి SSMB29 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కూడా భారీగా హైప్ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్ కోసం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. కానీ, సరిగ్గా ఈ టైమ్‌లో డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి, కొన్ని షాకింగ్ రూల్స్ చెప్పారు. ముఖ్యంగా, ఫ్యాన్స్ చేసే చిన్న పొరపాటు వల్ల ఈవెంట్ మొత్తం క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

"ఇది ఓపెన్ ఈవెంట్ కాదు.. పాస్ ఉంటేనే రండి

రాజమౌళి చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. "ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. దయచేసి ఎవరూ పాస్ లేకుండా రావద్దు," అని గట్టిగా చెప్పారు. "సోషల్ మీడియాలో కొందరు ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరైనా రావచ్చు అని, చెప్తున్నారు. అలా వచ్చే ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మకండి," అని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. కేవలం 'ఫిజికల్ పాస్' చేతిలో ఉన్న వాళ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఈవెంట్‌కు వస్తున్న ప్రతీ ఒక్కరూ తమ పాస్‌ను వెంట తెచ్చుకోవడం తప్పనిసరి అని అన్నారు.

వాళ్లకు 'నో ఎంట్రీ'

ఈ ఈవెంట్‌కు కొన్ని కఠినమైన వయోపరిమితులు కూడా పెట్టారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు, అలాగే సీనియర్ సిటిజన్లకు (పెద్ద వయసు వారికి) పోలీస్ డిపార్ట్‌మెంట్ అనుమతి నిరాకరించిందని రాజమౌళి తెలిపారు. వాళ్లందరూ తమ భద్రత దృష్ట్యా ఇంట్లోనే ఉండాలని, ఈవెంట్‌ను 'జియో హాట్‌స్టార్' లో లైవ్ చూడాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.

RFC మెయిన్ గేట్ క్లోజ్... రూట్ మ్యాప్ ఇదే!

ఈవెంట్‌కు వచ్చే వారి కోసం రూట్ మ్యాప్‌పై జక్కన్న ఫుల్ క్లారిటీ ఇచ్చారు. "నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ (విజయవాడ హైవేపై ఉండేది) పూర్తిగా మూసివేసి ఉంటుంది," అని పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. ఎవరూ ఆ గేట్ వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. విజయవాడ నుంచి వచ్చేవారు మెయిన్ గేట్‌కు ముందే లెఫ్ట్ తీసుకుని ఈవెంట్ బ్యాక్ సైడ్‌కు చేరుకోవాలి. ఇక ఎల్బీ నగర్, వనస్థలిపురం, గచ్చిబౌలి నుంచి ORR మీదుగా వచ్చేవారు ఎగ్జిట్ 11 లేదా 12 తీసుకొని, సర్వీస్ రోడ్ ద్వారా 'సాంఘీ నగర్' రూట్‌లోంచి ఈవెంట్ వద్దకు రావాలని సూచించారు.

పాస్‌పై QR కోడ్... 'షార్ట్‌కట్' ఫ్రెండ్స్‌ను నమ్మొద్దు!

ఫ్యాన్స్‌కు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని, ప్రతీ ఫిజికల్ పాస్‌పై ఒక QR కోడ్ ఇచ్చారు. దాన్ని స్కాన్ చేస్తే, మీరు ఏ రూట్‌లో రావాలో క్లియర్ వీడియో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈవెంట్ ప్లేస్‌కు దారి చూపే సైన్ బోర్డులు కూడా దారి పొడవునా ఉంటాయని చెప్పారు. అలాగే, "ప్రతీ గ్యాంగ్‌లో ఒకడు ఉంటాడు, 'నాకు షార్ట్‌కట్ తెలుసురా' అని చెప్పేవాడు. దయచేసి వాడి మాట వినొద్దు. కేవలం సైన్ బోర్డులను, ఇన్స్ట్రక్షన్స్‌ను మాత్రమే ఫాలో అవ్వండి," అని జక్కన్న సరదాగా కానీ సీరియస్‌గా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే గేట్లు తెరుస్తారని, మంచి పార్కింగ్, మంచి సీట్లు కావాలంటే త్వరగా రావాలని సూచించారు.

చిన్న గొడవ జరిగినా... ఈవెంట్ క్యాన్సిల్!

చివరగా, రాజమౌళి అందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "గతంలో జరిగిన కొన్ని ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని, ఈసారి పోలీసులు చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. కమిషనర్ గారు పర్సనల్‌గా చెప్పారు. ఈవెంట్‌లో ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా, కంట్రోల్ తప్పినా... ఈవెంట్ వెంటనే క్యాన్సిల్ చేయబడుతుంది," అని స్పష్టం చేశారు. ఇదంతా మన సేఫ్టీ కోసమే కాబట్టి, దయచేసి అందరూ పోలీసులకు సహకరించి, రూల్స్ పాటిస్తూ ఈవెంట్‌ను సక్సెస్ చేద్దామని రాజమౌళి ఫ్యాన్స్‌ను కోరారు.