అలాంటి ఇన్ సెక్యూర్ ఫీలింగ్స్ ఏం లేవు!
ఈ సినిమా రిలీజ్ సమయంలో? ఆ భామలిద్దరి మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో మాటల యుద్దమే జరిగింది.
By: Srikanth Kontham | 8 Jan 2026 3:00 PM ISTఒకే హీరోతో ఇద్దరు భామలు నటిస్తోన్న క్రమంలో పోటీ సహజంగా కనిపిస్తుంది. ఎవరు బాగా నటించారు? ఎవరికి హీరోతో కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎవరి పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుంది? ఏవరికి గుర్తింపు ఎక్కువగా వస్తుంది? అనే డిస్కషన్ సహజంగా జరుగుతుంది. త్రిష..అనుష్క సైతం ఈ విషయంలో పోటీ పడ్డవారే. తల అజిత్ హీరోగా నటించిన `ఎంతవాడుగానీ` సినిమాలో త్రిష, అనుష్క హీరోయిన్లగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సమయంలో? ఆ భామలిద్దరి మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో మాటల యుద్దమే జరిగింది.
అజిత్ తో కాంబినేషన్ సన్నివేశాల విషయంలో తలెత్తిన వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది. తారసపడితే ఇద్దరు ఇప్పటికీ మాట్లాడుకోరు. ఓ స్టార్ హీరోతో ఇద్దరు పేరున్న భామలు సమాన పాత్రలు పోషిస్తే ఈ రకమైన వివాదాలు తెరపైకి వస్తుంటాయి. ఇంకొంత మంది ఇన్ సెక్యూర్ గానూ ఫీలవుతుంటారు. తాజాగా ఇదే ప్రశ్న సాక్షి వైద్య ముందుకెళ్లింది. యంగ్ హీరో శర్వానంద్ హీరోగా `నారీ నారీ నడుమ మురారీ` సినిమా లో సయుక్తామీనన్, సాక్షి వైద్య హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ క్రమంలో సాక్షి ముందు ఆ క్వశ్చన్ రెయిజ్ అయింది.
దీనికి సాక్షి చక్కటి సమాధానం ఇచ్చింది. సినిమాలో తనతో పాటు మరో నాయిక ఉందనే అభద్రతా భావం గానీ, తెరపై ఎవరు ఎక్కువ సమయం కనిపిస్తారు? హీరో సరసన ఎవరి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది? ఇలాంటి భయా లేవి తనకు లేవంది. ఇలాంటి వాటిని ఎంత మాత్రం బుర్రలోకి రానివ్వనంది. సంయుక్తా మీనన్ సహా మిగతా నటీనటులతో కలిసి ఎంతో సరదాగా పని చేసానంది. `ఆ అనుభవాలు మాత్రమే గుర్తుంచుకుంటాను. సినిమాలో ఒకరు ఎక్కువ? మరొకరు తక్కువ? అన్న ఆలోచన ఇంత వరకూ ఎప్పుడూ రాలేదంది.
అలా కూడా ఆలోచిస్తారా? అన్న ఆలోచన కూడా తనలో ఎప్పుడూ కలగలేదంది. తాను ఏ విషయాన్ని అయినా పాజిటివ్ గా తీసుకుంటానని..తలకెక్కించుకుని వాటి గురించి ఎక్కువగా ఆలోచించే అలవాటు చిన్న నాటి నుంచి లేదంది. అలాగే దర్శకులపై రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజ్ మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవారంది. దీంతో తమ పని కూడా ఎంతో సులభంగా పూర్తయిందని తెలిపింది.
