Begin typing your search above and press return to search.

నైజాం ఓపెనింగ్ షేర్స్ టాప్ లో పుష్ప 2.. ఓజీకి ఆ హైప్ కలిసొస్తుందా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రేడ్ వర్గాల విశ్లేషకుల చూపు నైజాం ఏరియాపైనే ఉంటుంది.

By:  M Prashanth   |   23 Aug 2025 3:55 PM IST
నైజాం ఓపెనింగ్ షేర్స్ టాప్ లో పుష్ప 2..  ఓజీకి ఆ హైప్ కలిసొస్తుందా?
X

తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే ట్రేడ్ వర్గాల విశ్లేషకుల చూపు నైజాం ఏరియాపైనే ఉంటుంది. ఇక్కడ భారీ వసూళ్లు సాధిస్తే.. సినిమా బడ్జెట్ లో ఎక్కువ రికవరీ అవుతుందని అంచనా వేస్తారు. ఈ క్రమంలో మరి ఇప్పటివరకు నైజాంలో అత్యధికంగా డే 1 షేర్ వసూల్ చేసిన సినిమా ఏది? టాప్ 10లో ఏయే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం

అల్లు అర్జున్ పుష్ప 2 గతేడాది రిలీజై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లాంగ్ రన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇక నైజాంలో ఈ సినిమా రూ.25.40 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు నైజాం ఏరియాలో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా పుష్ప 2 నే టాప్ లో కొసాగుతోంది. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉంది.

2022లో రిలీజైన ఆర్ఆర్ఆర్ రూ.23.30 కోట్లు కొల్లగొట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర రూ.22.30కోట్లతో మూడో స్థానంలో ఉంది. ప్రభాస్ సలార్ రూ.20.55 కోట్లతో నాలుగో ప్లేస్ లో, కల్కి ఏడీ 2898 సినిమా రూ.19.60 కోట్లతో ఐదో స్థానంలో వరుసగా ఉన్నాయి.

నైజాం టాప్ 10 తొలి రోజు షేర్ వసూళ్లు

పుష్ప 2 - 25.40 కోట్లు

ఆర్ఆర్ఆర్- 23.30 కోట్లు

దేవర - 22.60 కోట్లు

సలార్- 20.55 కోట్లు

కల్కి 2898AD - 19.60 కోట్లు

గుంటూర్ కారం - 16.90 కోట్లు

ఆదిపురుష్ - 13.68 కోట్లు

సర్కారు వారిపాట - 12.24 కోట్లు

హరిహర వీరమల్లు - 12.15 కోట్లు

BN - 11.81 కోట్లు

అయితే వచ్చే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి దీనిపై ఫుల్ బజ్ ఉంది. ఫ్యాన్స్ లో అంచనాలు సైతం ఎక్కువగానే ఉంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

ఈ సినిమాకు ఫుల్ హైప్ ఉండడంతో ఓజీ తొలి రోజు కలెక్షన్లపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ.100 కోట్లు ఓపెనింగ్ రోజే కలెక్షన్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నైజాంలో ఓజీ ఓపెనింగ్ డే రూ.30 కోట్ల షేర్ అందుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.