Begin typing your search above and press return to search.

మ‌ల్లూ బ్యూటీ కొత్త లుక్ ఊహించ‌లేదే

కొంద‌రు ఎంత‌గా నియంత్రించాల‌నుకున్నా అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేరు. అదే జాబితాలో ఉంది నివేద థామ‌స్.

By:  Sivaji Kontham   |   29 Aug 2025 10:02 AM IST
మ‌ల్లూ బ్యూటీ కొత్త లుక్ ఊహించ‌లేదే
X

కొంద‌రు ఎంత‌గా నియంత్రించాల‌నుకున్నా అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేరు. అదే జాబితాలో ఉంది నివేద థామ‌స్. ఈ బ్యూటీ త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో పాటు మంచి మాట తీరుతోను అంద‌రి హృద‌యాల‌ను కొల్ల‌గొడుతుంది. నివేద థామ‌స్ ఒక మ‌ల‌యాళీ అమ్మాయి అయినా కానీ, తెలుగులో అద్భుతంగా మాట్లాడి మ‌న‌సుల్ని గెలుచుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ రేసులో వెన‌క‌బ‌డ‌టాన్ని అభిమానులు స‌హించ‌లేక‌పోతున్నారు.


అయితే నివేద ఇటీవ‌ల అవ‌కాశాలు అందుకోలేక‌పోవ‌డానికి కార‌ణం `అధిక బ‌రువు` సమ‌స్య‌ అని చెబుతున్నారు. ఇటీవ‌ల కొంత‌కాలంగా నివేద అదుపు త‌ప్పి బ‌రువు పెర‌గ‌డం తీవ్ర ఆందోళ‌న‌ల‌కు కార‌ణ‌మైంది. ఇదే తీరుగా బ‌రువు పెరుగుతూ ఉంటే, మునుముందు మ‌మ్మీ, ఆంటీ పాత్ర‌ల‌కు కూడా ఎంపిక‌వ్వ‌డం క‌ష్ట‌మ‌ని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.


నివేద తిరిగి నిన్ను కోరి, బ్రోచేవారెవ‌రురా లో క‌నిపించిన‌ట్టుగా హీరోయిన్ మెటీరియ‌ల్ లుక్‌తో క‌నిపించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ నివేద మాత్రం దీనికోసం జిమ్ లో క‌స‌ర‌త్తులు చేయ‌క‌పోవ‌డం, అద‌నంగా శ్ర‌మించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.


అయితే నివేద‌ ఉన్న‌ట్టుండి ఇటీవ‌ల కొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈసారి కొంత బ‌రువు త‌గ్గి అందంగా క‌నిపించింది. లేటెస్ట్ ఫోటోషూట్ చూడ‌గానే అభిమానుల్లో కొత్త‌ ఉత్సాహం నెల‌కొంది. నివేద ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ త‌మ ఫేవ‌రెట్ న‌టికి వెల్ కం చెబుతున్నారు. 2025 గ‌ద‌ర్ అవార్డుల్లో క‌నిపించిన రూపానికి ఇప్ప‌టికి చాలా మెరుగ్గా క‌నిపిస్తోంది. ఇప్పుడు బ‌రువు త‌గ్గింది. ఇంకా మునుముందు బ‌రువు త‌గ్గేందుకు ఆస్కారం ఉంద‌ని ఫ్యాన్స్ న‌మ్ముతున్నారు. నివేద ఇదే తీరుగా క‌స‌ర‌త్తుల‌తో మ‌రింత స్లిమ్ గా మారాల‌ని కోరుకుంటున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ... ఇటీవ‌ల `35- చిన్న క‌థ కాదు` అనే చిత్రంలో ఒక స్కూల్ పిల్లాడికి త‌ల్లిగా న‌టించిన నివేద థామ‌స్ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను గ‌ద్ద‌ర్ అవార్డ్స్ లో ఉత్త‌మ న‌టి పుర‌స్కారాన్ని గెలుచుకుంది. ప్ర‌స్తుతం బ‌రువు త‌గ్గుతోంది. మునుముందు ఇంకా స్లిమ్ గా మారి టాలీవుడ్ లో మ‌రిన్ని చిత్రాల్లో న‌టించేందుకు అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.