Begin typing your search above and press return to search.

AK 47: నివేదా రోల్‌లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఉందా?

త్రివిక్రమ్ సినిమాల్లో మెయిన్ లీడ్స్ ఎంత సందడి చేస్తారో, పక్కనుండే చిన్న క్యారెక్టర్లు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి.

By:  M Prashanth   |   27 Oct 2026 9:43 PM IST
AK 47: నివేదా రోల్‌లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఉందా?
X

త్రివిక్రమ్ సినిమాల్లో మెయిన్ లీడ్స్ ఎంత సందడి చేస్తారో, పక్కనుండే చిన్న క్యారెక్టర్లు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. వెంకటేష్ తో మాటల మాంత్రికుడు తీస్తున్న 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నివేదా పేతురాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా వేదికలపై హీరోయిన్లు రొటీన్ గా పొగడ్తలు కురిపించడం కామనే అయినా, నివేదా మాత్రం తన పాత్ర నిడివి గురించి ఉన్నదున్నట్లు ఓపెన్ అయిపోవడం ఆసక్తికరంగా మారింది.

షూటింగ్ ఆఖర్లో తాను సెట్స్ లో అడుగుపెట్టానని, చాలా తక్కువ రోజులే వర్క్ చేశానని ఆమె వెల్లడించింది. తనకు పూర్తి కథ కూడా తెలియదని, థియేటర్ కు వెళ్లి తానే సినిమాను స్వయంగా చూసుకోవాలని సరదాగా చెప్పింది. వినడానికి ఇవి క్యాజువల్ మాటల్లాగే అనిపిస్తున్నా, టాలీవుడ్ లెక్కలను గమనించే వాళ్లకు మాత్రం దీని వెనుక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి.

గతంలో త్రివిక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో కూడా నివేదా కనిపించింది. అక్కడ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పరిమితం. హీరో, సెకండ్ హీరో సరసన కాసేపు అలా మెరిసి వెళ్లిపోయే క్యారెక్టర్ అది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆమెకు ప్లస్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ ఆమెను ప్రత్యేకంగా పిలిచి మరో అవకాశం ఇవ్వడం వెనుక ఏదైనా బలమైన ఉద్దేశం ఉందా అన్నది చూడాలి.

ఒక ఆర్టిస్ట్ ను చివరి నిమిషంలో ప్రాజెక్ట్ లోకి తీసుకుని, పూర్తి కథ చెప్పకుండా కొద్ది రోజులే షూట్ చేశారంటే రెండు అవకాశాలు కనిపిస్తాయి. కథ నడుస్తున్నప్పుడు కాసేపు రిలీఫ్ ఇచ్చే ఒక క్యాజువల్ రోల్ కావచ్చు. లేదా ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్ లో ఊహించని మలుపు తిప్పే ఒక హై ఓల్టేజ్ సర్ ప్రైజ్ క్యారెక్టర్ అయినా అయ్యుండాలి. త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లేలో ఇలాంటి దాగుడుమూతలు కొత్తేమీ కాదు.

టైటిల్ లోనే 'ఆదర్శ కుటుంబం' అంటూనే పక్కన 'ఏకే 47' అనే గన్ పేరు తగిలించారు. ఫ్యామిలీ డ్రామా నడుస్తూనే తెరవెనుక ఏదో క్రైమ్ లేదా పవర్ గేమ్‌ నడుస్తుందనే హింట్ మొదటి నుంచీ ఉంది. టీజర్ నుంచి ట్రైలర్ వరకు అదే హైలెట్ అయ్యింది. ఇక అలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న కథలో నివేదా పాత్ర చాలా కీలకమైన మలుపునకు కారణంగా మారే ఛాన్స్ లేకపోలేదు. ఆ సస్పెన్స్ లీక్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆమెకు పూర్తి కథ చెప్పకుండా తన సీన్ల వరకే లాగించేశారా అనే చర్చ నడుస్తోంది. వెంకీ లాంటి పెద్ద స్టార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ ప్రాజెక్ట్ లో ఉండటమే ఏ నటికైనా మంచి అడ్వాంటేజ్. ఇక అల వైకుంఠపురములో తరహాలోనే ఆమె సాధారణ పాత్రతోనే ముగిస్తుందా, లేక కథను కుదుపేసే హిడెన్ ట్రంప్ కార్డుగా థియేటర్లలో విజిళ్లు వేయిస్తుందా అనేది రిలీజ్ రోజే తేలనుంది.