Begin typing your search above and press return to search.

ఫేడౌట్ అనుకుంటే బౌన్స్ బ్యాక్.. నివేదా క్రేజీ లైనప్

వెంకటేష్ సినిమా ఛాన్స్ తోనే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నివేదా.. ఇప్పుడు ఏకంగా మరో మెగా ఆఫర్ కూడా తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   17 Jun 2026 12:45 PM IST
ఫేడౌట్ అనుకుంటే బౌన్స్ బ్యాక్.. నివేదా క్రేజీ లైనప్
X

టాలీవుడ్ లో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఒకట్రెండు ఫ్లాపులు పడినా లేదా కాస్త గ్యాప్ వచ్చినా ఇక ఫేడౌట్ అయిపోయారని ఈజీగా డిసైడ్ చేసేస్తారు. టాలెంటెడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ విషయంలో కూడా రీసెంట్ గా ఇలాంటి కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. తెలుగులో ఆమెకు అవకాశాలు దాదాపు తగ్గిపోయాయనే టాక్ నడుస్తున్న టైమ్ లో.. సడెన్ గా రెండు భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టి ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది.

గతంలో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ కు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సరైన బ్రేక్ రాలేదు. ఆమె కెరీర్ పూర్తిగా స్లో అయిపోయినట్లే అనిపించింది. రీసెంట్ గా వచ్చిన సింగ్ గీతం సినిమాలో కూడా ఆమె కేవలం ఒక చిన్న క్యామియో రోల్ కే పరిమితం అయింది. దీంతో ఆల్మోస్ట్ ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా అనేలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఆమె ప్లానింగ్ వేరేలా ఉంది.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో నివేదా ఒక క్రేజీ ఛాన్స్ దక్కించుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్ లో ఆమె రోల్ చాలా పవర్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ లో కథను మలుపు తిప్పేలా ఉండబోతోందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా ఆఫర్ ఆమె కెరీర్ కు ఒక పెద్ద బూస్ట్ లాంటిది.

వెంకటేష్ సినిమా ఛాన్స్ తోనే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నివేదా.. ఇప్పుడు ఏకంగా మరో మెగా ఆఫర్ కూడా తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా158 ప్రాజెక్ట్ లో ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. చిరంజీవి, యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నివేదాకు ఒక మంచి రోల్ దొరకడం నిజంగా ఆమె లక్ అనే చెప్పాలి.

ఒకప్పుడు ఆఫర్స్ తగ్గినప్పుడు ఏది పడితే అది చేసుకుంటూ పోకుండా కాస్త గ్యాప్ తీసుకుని మంచి కంటెంట్ ఉన్న సినిమాల కోసం వెయిట్ చేయడం నివేదాకు ఇప్పుడు బాగా కలిసొచ్చింది. అనవసరమైన హడావుడి లేకుండా సైలెంట్ గా తన యాక్టింగ్ టాలెంట్ నే నమ్ముకుని ముందుకు వెళ్తోంది. మేకర్స్ కూడా ఆమె స్కిల్స్ మీద ఉన్న నమ్మకంతోనే ఇలాంటి బడా ప్రాజెక్ట్స్ లో కీలకమైన రోల్స్ కు ఆమె పేరును ఫైనల్ చేస్తూ అవకాశం ఇస్తున్నారు. ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ తో నివేదా పేతురాజ్ మార్కెట్ వాల్యూ కూడా టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక పక్క త్రివిక్రమ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్, మరో పక్క చిరంజీవి లాంటి బిగ్గెస్ట్ స్టార్ హీరో సినిమా.. ఈ రెండు థియేటర్లలో హిట్ అయితే ఆమె కెరీర్ కంప్లీట్ గా టర్న్ తీసుకుంటుంది.