ఆ పాట లేదేంటి గురూజీ… కుర్రాళ్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు
నిన్న రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు.. కొన్ని నెలల ముందు వచ్చిన ‘బ్లాస్ట్’ మూవీతో పోలికలు ఉన్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
By: Garuda Media | 31 Oct 2026 8:15 PM ISTనిన్న రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు.. కొన్ని నెలల ముందు వచ్చిన ‘బ్లాస్ట్’ మూవీతో పోలికలు ఉన్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ రెండు చిత్రాలూ ఒకే టైంలో మేకింగ్‌లో ఉండగా ఎలా కాపీ కొడతారనే ప్రశ్న తలెత్తింది. ఐతే ‘బ్లాస్ట్’ కూడా ఓ హాలీవుడ్ మూవీ నుంచి లైన్ తీసుకుందని.. అదే సినిమా నుంచి త్రివిక్రమ్ కూడా స్ఫూర్తి పొందారని వార్తలు వచ్చాయి.
ఐతే ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ చూస్తే.. ‘బ్లాస్ట్’ సినిమాతో కొంత పోలిక ఉన్న మాట వాస్తవమే కానీ, దాని కథ- ట్రీట్మెంట్ వేరు. దీని వ్యవహారం వేరు. మరి ముందు నుంచే ఈ తేడా ఉందా.. లేక ‘బ్లాస్ట్’ రిలీజయ్యాక త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేశారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ చర్చ వల్ల ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ సందర్భంగా దాంతో పాటు ‘బ్లాస్ట్’ సినిమా పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం విశేషం.
ఈ సంగతి పక్కన పెడితే.. సినిమాలో నివేథా పెతురాజ్ అసలు ఎందుకు ఉంది అనే చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ అన్నది కామన్. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యమూ ఉండదు. గ్లామర్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో రెండో హీరోయిన్ని పెడుతుంటాడు త్రివిక్రమ్. కొన్నిసార్లు వాళ్లను పాటల కోసం కూడా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఐతే ‘ఆదర్శ కుటుంబం’లో నివేథా పెతురాజ్ పాత్ర మరీ సాధారణంగా ఉందని.. ఆ క్యారెక్టర్ సినిమాలో ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మీద పెట్టిన స్పెషల్ సాంగ్‌ను కూడా తీసేయడంతో పాత్ర ప్రాధాన్యం మరింత తగ్గిపోయింది. వెంకీ, నివేథాల మీద ‘మాలా..’ అంటూ సాగే ఒక రొమాంటిక్ సాంగ్ తీశాడు త్రివిక్రమ్. ఆ పాటను కొన్ని వారాల ముందు ఆన్ లైన్లో రిలీజ్ చేశారు కూడా.
చాలా గ్రాండ్‌గా తీసిన ఆ పాటలో నివేథా ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. ఈ పాట విజువల్స్ చూసి త్రివిక్రమ్ మీద రాఘవేంద్రరావు పూనాడా అనే కామెంట్లు కూడా వినిపించాయి. మరి అంత ఎట్రాక్టివ్‌గా కనిపించిన పాటను సినిమా నుంచి తీసేయడం పట్ల నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కుర్రాళ్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఐతే ఆ పాట మిస్సయినా.. ‘నారాయణమ్మా’ పాటలో నివేథాతో పాటు డింపుల్ హయతి సూపర్ సెక్సీగా స్టెప్పులేయడం మాత్రం వారిని అలరిస్తోంది.
