Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం

ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

By:  Ramesh Palla   |   30 Oct 2026 1:00 AM IST
పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం
X

ఎప్పుడో మెంటల్‌ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. హీరోయిన్‌గానే చేస్తాను, మంచి సినిమాల్లో కనిపించాలి అనుకుంటున్నాను అని కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తూనే ఉంది. నటిగా తనను తాను ఇప్పటికే పలు సినిమాలతో నిరూపించుకున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియా ద్వారా తన అందం చూపించడం ద్వారా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూ, ట్రెండ్‌ అవుతున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి అందమైన ఫోటోలతో వైరల్‌ అయింది. ఆకట్టుకునే రూపంతో పాటు, ఏ డ్రెస్ వేసినా చూడముచ్చటగా ఉంది అనిపించుకునే ఈ అమ్మడు మరోసారి సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఔట్‌ ఫిట్‌ పడితే ఏ బ్యూటీని అయినా అలా చూస్తూ ఉండి పోతాం. ఇప్పుడు నివేదా ను అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.

సింగ్‌ గీతం సినిమాలో నివేదా పేతురాజ్‌...

తెలుగులో కాస్త గ్యాప్‌ తర్వాత సింగ్‌ గీతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నివేదా మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో నటించడమే ఒక గొప్ప గౌరవం అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాలో నటించిన తర్వాత మరో బిగ్గెస్ట్‌ క్రేజీ కాంబోతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న త్రివిక్రమ్‌, వెంకటేష్ కాంబోలో రూపొందిన 'ఆదర్శ కుటుంబం' సినిమాతో నివేదా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించిన విషయం తెల్సిందే. అయితే ఆమె పాత్రకు ఏమాత్రం తగ్గకుండా చాలా కీలకమైన పాత్రలో నివేదా పేతురాజ్ నటించినట్లు సమాచారం అందుతోంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో శ్రీనిధి కి సమానమైన ప్రాధాన్యతను ఈ అమ్మడు దక్కించుకున్న విషయం తెల్సిందే.

సోషల్‌ మీడియాలో అందాల ఫోటో షూట్‌...

ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ గతంలో షేర్ చేసిన చాలా ఫోటో షూట్స్‌ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు అది నూటికి నూరు శాతం నిజం అని చెప్పే విధంగా ఈ రెడ్‌ డ్రెస్ అందాల ఫోటో షూట్‌ నిరూపించింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి కెమెరా ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా నివేదా పేతురాజ్‌ ఈ ఫోటో షూట్‌తో వైరల్‌ అయింది. నెత్తి నిండా ఎర్రటి గులాబీలు ధరించడంతో పాటు, టాప్‌ టు బాటమ్‌ రెడ్‌ డ్రెస్ లో మెరిసిన ఈ అమ్మడు చూపు తిప్పనివ్వడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగానే ముద్దుగుమ్మలు రెడ్‌ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాలో నివేదా పేతురాజ్‌...

రెడ్‌ డ్రెస్ అందాలతో నివేదా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇంత అందంగా ఉన్నప్పటికీ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించక పోవడం, స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు రాకపోవడం విడ్డూరంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి అయినా స్టార్‌ హీరోయిన్స్ ఈ అందంను చూడాలని, ఫిల్మ్‌ మేకర్స్ ఈమె వైపు కాస్త చూడాలంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. త్రివిక్రమ్‌ సైతం ఈమెను మెయిన్‌ లీడ్‌ కి తీసుకోకుండా సెకండ్‌ హీరోయిన్‌ గానే రెండో సారి నటింపజేయడంపై కొందరు ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ గారు మీ తర్వాత సినిమాలో అయినా నివేదా పేతురాజ్‌ గారికి మెయిన్‌ లీడ్‌ ఛాన్స్ ఇవ్వాలని, దాంతో ఆమె తనను తాను నిరూపించుకుంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది.