హీరోయిన్ పెళ్లి.. ముందే కనిపించిన ట్విస్ట్
హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రేమ, పెళ్లి వ్యవహారం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 27 Sept 2026 1:20 PM ISTహీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రేమ, పెళ్లి వ్యవహారం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని చెప్పిన ఆమె.. ఇప్పుడు ఆ రిలేషన్ బ్రేకప్ వరకు వెళ్లిన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. ఆ రిలేషన్ విషయంలో ముందే తనకు ఓ అనుమానం వచ్చిందని చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
మెంటల్ మది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రలహరి, బ్రోచేవారెవరా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో నటించారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నా.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. నివేదా వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది.
గత ఏడాది వినాయక చవితి సందర్భంగా తన లవర్ ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్ తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వెల్లడించారు. రజిత్ తో తన పరిచయం ఐదేళ్ల క్రితం దుబాయ్ లో జరిగిన ఓ రేసింగ్ సందర్భంగా మొదలైందని నివేదా గతంలో చెప్పారు. మొదట ఇద్దరూ ఫ్రెండ్స్ గా ఉన్నామని, ఆ తర్వాత అభిప్రాయాలు కలవడంతో ప్రేమలో పడ్డామని తెలిపారు. తమ ప్రేమ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని, ఒక్కసారిగా బయటపెట్టడంతో తన మేనేజర్ కూడా షాక్ అయ్యారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. అక్టోబర్ లో ఎంగేజ్మెంట్, జనవరిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు కూడా అప్పట్లో నివేదా వెల్లడించారు. పెళ్లి పనులు కూడా మొదలుపెట్టామని, రెండు కుటుంబాలు దుబాయ్‌లో ఉన్నాయని చెప్పారు. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య సింపుల్‌గా పెళ్లి చేసుకుంటామని తెలిపారు. కానీ ఆ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లలేదు. లేటెస్ట్ గా తన పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడిన నివేదా.. మాజీ ప్రియుడితో బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తనకు ముందే ఏదో తేడా జరగబోతుందన్న భావన కలిగిందని ఆమె తెలిపారు. మనసులో ఏదైనా నెగిటివ్ గా ఊహించుకుంటే అది నిజమైపోతుందని నివేదా చెప్పారు. తన మాజీ ప్రియుడు తనను వదిలేస్తాడో కూడా ముందే ఊహించానని, చివరకు అదే జరిగిందని వెల్లడించారు. ఆ ఎక్స్పీరియన్స్ తనను చాలా ఆలోచించేలా చేసిందని తెలిపారు.
ఆ తర్వాత నుంచి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని నివేదా చెప్పారు. అయితే మనసులో ఆలోచనలు రావడం నార్మల్ కదా అంటూ తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పర్సనల్ లైఫ్ ను పక్కనపెట్టి, సినిమాల్లో మళ్లీ తనదైన శైలిలో అలరించాలని ట్రై చేస్తున్న నివేద.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
