కావాలనే ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ లవ్ లో ఉన్న విషయాన్ని రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 12:21 AM ISTటాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ లవ్ లో ఉన్న విషయాన్ని రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా వెల్లడించారు. తన ప్రియుడిని పరిచయం చేస్తూ నివేదా అసలు విషయాన్ని బయటపెట్టారు. దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్ తో రిలేషన్ లో ఉన్నాననే సంగతిని నివేదా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
పలు సినిమాలతో నటిగా గుర్తింపు
మధురైలో పుట్టి, అక్కడే పెరిగిన నివేదా 2016లో ఓ కోలీవుడ్ సినిమా ద్వారా నటిగా మారి, తర్వాత మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిత్ర లహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా దమ్కీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నివేదా చేతిలో ప్రస్తుతం కొత్త సినిమాలేమీ లేవు.
ఐదేళ్లుగా సీక్రెట్ గానే..
మొన్నీ మధ్య వరకు సినిమాలు చేస్తూ నటిగా బిజీగా ఉన్న నివేదా దాదాపు ఐదేళ్లుగా లవ్ లో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అమ్మడు చాలా సీక్రెట్ గా ఉంచారు. రీసెంట్ గా ప్రియుడిని పరిచయం చేయడంతో నివేదాకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ తనకు ఎంగేజ్‌మెంట్ అవలేదని, త్వరలోనే ఆ తంతు జరగనుందని నివేదా క్లారిటీ ఇచ్చారు.
అప్పట్నుంచే అతనితో పరిచయం
హీరోయిన్ అయినప్పటికీ రేసింగ్, బ్యాడ్మింటన్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఐదేళ్ల కిందట దుబాయ్ లో జరిగిన ఫార్ములా రేసింగ్ సందర్భంగా రజిత్ తో తనకు పరిచయం ఏర్పడిందని, ముందు ఫ్రెండ్స్ గానే ఉన్నామని, కానీ తర్వాత కొన్నాళ్లకు ప్రేమలో పడ్డామని, దాన్ని ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నట్టు నివేదా చెప్పారు. అయితే తాము ప్రేమలో ఉన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని, ఇండస్ట్రీలో అయితే ఎవరికీ తెలియదని, ఆఖరికి తన మేనేజర్ కు కూడా ఈ విషయం తెలియదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నివేదా. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలయ్యాయని, ఈ అక్టోబర్ లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని నెక్ట్స్ ఇయర్ లో పెళ్లి చేసుకోనున్నట్టు పేర్కొన్నారు. తనకు కాబోయే భర్త సినిమాలు ఎక్కువగా చూస్తారని, కెరీర్ పరంగా తనకు సపోర్ట్ చేస్తుంటారని నివేదా తెలిపారు.
