లీగ్ చిన్నదైనా.. ఛాన్స్ పెద్దదే!
చిత్ర పరిశ్రమలో కాంబినేషన్లు అనేవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే కథానాయికల ఎంపిక విషయంలో దర్శకులు సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు.
By: Srikanth Kontham | 23 May 2026 6:00 AM ISTచిత్ర పరిశ్రమలో కాంబినేషన్లు అనేవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే కథానాయికల ఎంపిక విషయంలో దర్శకులు సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` చిత్రంలో హీరోయిన్ల ఎంపిక అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ వెంకీకి జోడీగా `కేజీఎఫ్` ఫేమ్ శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయడం, తాజాగా తాజాగా గ్లామరస్ బ్యూటీ నివేదా పేతురాజ్‌ను మరో నాయికగా తీసుకుంటున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రికార్డు ఉన్నా? శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో ఇంకా స్టార్ లీగ్‌లోకి పూర్తి స్థాయిలో చేరలేదు. అలాగే నివేదా పేతురాజ్ కూడా వరుసగా మంచి సినిమాలు చేస్తున్నా? టాప్ లీగ్ స్టార్ హీరోయిన్‌గా స్థిరపడటానికి భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ల రేసులో ఉన్న ఇద్దరు భామలకు కాకుండా వీరిద్దరికీ సీనియర్ స్టార్ - క్రేజీ దర్శకుడి ప్రాజెక్ట్‌లో చోటు దక్కడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు భామలు ఇప్పటివరకు స్టార్ లీగ్‌లో పూర్తి స్థాయిలో అడుగు పెట్టకపోయినా? విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకునే అవకాశం రావడం పెద్ద విషయమనే చెప్పాలి.
వెంకటేష్ సినిమా అంటే ఒక వర్గానికి మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాంటి పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాలో ప్రధాన నాయికలుగా కనిపించే అవకాశం రావడం తో ఇద్దరి కెరీర్‌కు మైల్‌స్టోన్‌గా నిలిచిపోనుంది. ఆ రకంగా చూస్తే ఈ భామలిద్దరూ చాలా లక్కీ. సాధారణంగా సీనియర్ హీరోల సినిమాల్లో కథానాయికల పాత్రల ప్రాధాన్యత, వారి కెమిస్ట్రీపై ప్రేక్షకులు ప్రత్యేక నిఘా ఉంచుతారు. వెంకటేష్ సరసన వీళ్లిద్దరు ఎలా? సెట్ అవుతారు అనే సందేహాలు కొందరిలో ఉన్నా? దర్శకుడి విజన్ , మేకింగ్ శైలిపై పరిశ్రమకు పూర్తి నమ్మకం ఉంది.
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు, కథను మలుపు తిప్పే బలమైన క్యారెక్టరైజేషన్లు ఉండటంతో ప్రాజెక్ట్ లోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ఛాన్స్ ఇద్దరికీ తమ నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి అద్భుతమైన వేదిక కానుంది. ఈ సినిమా గనుక ఆశించిన విజయాన్ని సాధిస్తే శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌ల మార్కెట్ వాల్యూ మరింత పెరుగుతుంది. మిగిలిని సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ అవుతారు.
