Begin typing your search above and press return to search.

స్మృతిమంధాన దారిలో నివేత పేతురాజ్.. నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేస్తూ..!

అయితే తాజాగా నివేత పేతురాజ్.. తనకి కాబోయే భర్త ఇంస్టాగ్రామ్ ని అన్ ఫాలో చేయడంతో పాటు కాబోయే వాడితో దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది.

By:  Madhu Reddy   |   9 Dec 2025 12:12 PM IST
స్మృతిమంధాన దారిలో నివేత పేతురాజ్.. నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేస్తూ..!
X

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ముందు చేసుకునే సెలబ్రేషన్స్ లన్ని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకొని బహిరంగంగా తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి.. సడన్గా ఏమవుతుందో ఏమో కానీ పెళ్లి, నిశ్చితార్థాలను రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్మృతి మంధాన పెళ్లి పీటల వరకు వచ్చిన వివాహాన్ని రద్దు చేసుకుంది. పలాశ్ ముచ్చల్ తో స్మృతి మంధాన వివాహం రద్దవడంతో.. ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.

విషయంలోకి వెళ్తే.. నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలా పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడం, ఆ మరుసటి రోజు పలాశ్ కూడా హాస్పిటల్ పాలవడంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాం అంటూ ఇటీవల స్మృతి మందాన, పలాశ్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే.. తాజాగా స్మృతి మంధాన బాటలోనే ఓ నటి కూడా పెళ్లి రద్దు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

మరి ఇంతకీ ఆమె ఎవరో కాదు నివేత పేతురాజ్.. తెలుగులో బ్రోచేవారెవరురా.. అల వైకుంఠపురంలో వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ నివేతా పేతురాజ్ ఈ మధ్యనే తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోను షేర్ చేసి పెళ్లి చేసుకోబోతున్నట్టు అభిమానులకు హింట్ ఇచ్చింది.

అయితే తాజాగా నివేత పేతురాజ్.. తనకి కాబోయే భర్త ఇంస్టాగ్రామ్ ని అన్ ఫాలో చేయడంతో పాటు కాబోయే వాడితో దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. దీంతో నివేత పేతురాజ్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నివేత పేతురాజ్ ఇంస్టాగ్రామ్ ని కూడా రజ్ హిత్ ఇబ్రాన్ అన్ఫాలో చేశారు. దాంతో ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

నివేత పేతురాజ్, రజ్ హిత్ ఇబ్రాన్ లు 2025లో తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు.అలాగే నివేత పేతురాజ్ రజ్ హిత్ తో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.కొన్ని రోజులు ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. కానీ సడన్గా నివేత ఇంస్టాగ్రామ్ ఖాతాలో తనకి కాబోయే వాడితో దిగిన ఫోటోలు గానీ నిశ్చితార్థపు ఫోటోలు గానీ ఎక్కడ కనిపించలేదు. మరోవైపు రజ్ హిత్ ఇబ్రాన్ కూడా నివేత పేతురాజ్ తో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఏది ఏమైనా సెలబ్రిటీలు ఇప్పుడు ఉన్నట్టుండి నిశ్చితార్థమైన తర్వాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నివేత పేతురాజ్ సినిమాల విషయానికి వస్తే. తమిళ్ సినీ పరిశ్రమలో పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోకి మెంటల్ మదిలో అనే సినిమాతో అడుగు పెట్టింది.

ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో, పాగల్, రెడ్,విరాటపర్వం, దాస్ కా ధమ్ కీ వంటి సినిమాల్లో నటించింది. 35 ఏళ్ల వయసున్న ఈ నటి గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ హీరోయిన్ పెళ్లి కోసమనే సినిమాలు ఒప్పుకోవడం లేదని,పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండి.. వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా కాబోయే భర్త ఇంస్టాగ్రామ్ ని అన్ఫాలో చేయడం, ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో వీరి వివాహం రద్దు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.