దుబాయ్ లో ఫ్రెండ్స్ తో హీరోయిన్ బ్యాచిలరేట్?
నివేదా ఇన్‌స్టా ఫీడ్ చూస్తుంటే బ్యాచిలర్ పార్టీ అంటే అందరినీ పిలిచి గ్రాండ్ గా చేయకుండా తన స్టైల్ లో నివేదా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందేమో అని అనుమానాలొస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 1:00 AM IST2016లో ఒరు నాల్ కూత్తు అనే తమిళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా పేతురాజ్, మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని మొన్నా మధ్య స్వయంగా నివేదానే వెల్లడించారు.
దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో నివేదా నిశ్చితార్థం
రాజ్‌హిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మ్యాన్ ను నివేదా పెళ్లి చేసుకోనున్నారు. తన పర్సనల్ లైఫ్ ను సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడే నివేదా అందులో భాగంగానే తన ఎంగేజ్‌మెంట్ ను కూడా పెద్దగా హంగూ ఆర్బాటం లేకుండా చేసుకుని సైలెంట్ గా విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో నివేదా పెళ్లి జరనుందని కూడా వార్తలొచ్చాయి.
గత కొన్నేళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్న నివేదా ఫ్యామిలీ
నివేదా ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్నారు. అక్కడే నివేదా, రాజ్‌హిత్ మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే నివేదా తాజా ఇన్‌స్టా స్టోరీ చూస్తుంటే ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ క్రీక్ హార్బర్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ ఫోటోలు, వీడియోలు చూసి దుబాయ్ లో నివేదా తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు .
నివేదా ఇన్‌స్టా ఫీడ్ చూస్తుంటే బ్యాచిలర్ పార్టీ అంటే అందరినీ పిలిచి గ్రాండ్ గా చేయకుండా తన స్టైల్ లో నివేదా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందేమో అని అనుమానాలొస్తున్నాయి. అసలే నివేదా తన పర్సనల్ లైఫ్ ను ఎక్కువగా బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి తన బ్యాచిలర్ పార్టీని కూడా చేసుకుని ఉంటారని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి నివేదా నిజంగానే తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారా లేదా క్యాజువల్ గా ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా కలిశారా అనేది తెలియాల్సి ఉంది.
