Begin typing your search above and press return to search.

కుక్క కాటుపై నివేదా కామెంట్.. క్లారిటీ ఇచ్చినా కూడా..

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   25 Nov 2025 11:06 AM IST
కుక్క కాటుపై నివేదా కామెంట్.. క్లారిటీ ఇచ్చినా కూడా..
X

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీధి కుక్కల వెల్ఫేర్ పై అవగాహన కల్పించే ర్యాలీలో పాల్గొన్న ఆమె, కుక్క కాటును అంత పెద్ద విషయంగా మార్చాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

తమిళనాడులోని చెన్నైలో జరిగిన స్ట్రీట్ డాగ్స్ వెల్ఫేర్ ర్యాలీలో పాల్గొన్న నివేదా, జంతు హింసపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. ప్రజల్లో భయం పెంచడమో, కుక్కలు నిర్మూలించాలని పిలుపునివ్వడం సమస్యకు పరిష్కారం కాదని ఆమె స్పష్టం చేశారు. కుక్క కాటు మీద భయాందోళన వద్దంటూ వ్యాఖ్యానించారు.

"మన కళ్ల ముందు జంతువులపై ఎన్నో హింసా ఘటనలు జరుగుతాయి. వాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ కుక్క కాటు అంటే మాత్రం ప్రజలు భయపడి, పెద్ద సమస్యలా చూపిస్తారు. రేబీస్‌ వంటి వ్యాధులు తీవ్రమేనని నిజం. కానీ దాన్ని భయపెట్టే సాధనంగా ఉపయోగించడం సరైంది కాదు" అంటూ నివేదా ర్యాలీలో మాట్లాడారు.

ఆ తర్వాత కుక్కలను చంపడం ఎప్పటికీ పరిష్కారం కాదని, వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ మాత్రమే శాశ్వతమైన మార్గమంటూ అభిప్రాయపడ్డారు. దీంతో నివేదా పేతురాజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా.. కుక్క కాటు పెద్ద విషయం కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యపై అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు.

ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల వల్ల జరిగిన దాడులు, పిల్లలపై జరిగిన దుర్ఘటనల గురించి నివేదాకు తెలియదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు కాస్త కేర్ లెస్ గా ఉన్నాయని చెబుతున్నారు. వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు. అలా అనేక వివిధ రకాలు విమర్శలు చేస్తుండగా.. మళ్లీ నివేదా రెస్పాండ్ అయ్యారు.

తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని పూర్తిగా కొందరు వక్రీకరిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇది కామన్ అయిపోయిందని.. ప్రజలు అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. వీధి కుక్కలను చంపడం పరిష్కారం కాదు అని చెప్పడమే తన ఉద్దేశ్యమని క్లారిటీ ఇచ్చారు. కానీ విమర్శలు ఆగడం లేదు. దీంతో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.