Begin typing your search above and press return to search.

శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట.. సింపుల్ లుక్ లో లక్ష్మీ ప్రణతి!

వివాహం ముగిసిన సందర్భంగా నూతన జంట సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

By:  Madhu Reddy   |   13 Oct 2025 5:46 PM IST
శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట.. సింపుల్ లుక్ లో లక్ష్మీ ప్రణతి!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దగ్గరుండి మరీ తన బావమరిది యంగ్ హీరో నార్నే నితిన్ వివాహం జరిపించిన విషయం తెలిసిందే. అక్క బావ ఇద్దరూ దగ్గరుండి మరి నార్నే నితిన్ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వివాహం అనంతరం తొలిసారి మీడియా కంట పడ్డారు నార్నే నితిన్ - శివాని దంపతులు.

వివాహం ముగిసిన సందర్భంగా నూతన జంట సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నూతన జంటతో పాటు నార్నే నితిన్ అక్క, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్ లుక్ లో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఈమె సింపుల్ లుక్ లో హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చ.

నార్నే నితిన్ 1994 జూన్ 15 హైదరాబాదులో నార్నే శ్రీనివాసరావు , నార్నే మల్లికా దంపతులకు జన్మించారు. నితిన్ తండ్రి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్, అలాగే వ్యవస్థాపకులు కూడా.. నితిన్ సెయింట్ ఫాల్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి, చెన్నైలోని లయోలా కాలేజ్ నుండి పట్టభద్రుడు అయ్యారు. నవంబర్ 2024లో హైదరాబాదులో స్వరూప - వెంకట కృష్ణ ప్రసాద్ కుమార్తె శివాని తాలూరితో నిశ్చితార్థం చేసుకున్న ఈయన ఇటీవల ఆమెతో ఏడడుగులు వేశారు.

సినిమాల విషయానికొస్తే.. 2023 లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మ్యాడ్ చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఊహించిన విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ చిత్రాలలో నటించారు. పైగా శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమాకి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు. సంపద హులీవాన, రావు రమేష్ , నరేష్ తదితరులు కీలకపాత్రను పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మ్యాడ్ క్యూబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.