Begin typing your search above and press return to search.

నిత్యామీన‌న్ పెళ్లికి ఒకే చెప్పిందా?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో, ప్రత్యేకమైన అభినయంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న నటి నిత్యామీనన్ గురించి ఓ ఆసక్తికర వార్త హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 1:00 AM IST
నిత్యామీన‌న్ పెళ్లికి ఒకే చెప్పిందా?
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో, ప్రత్యేకమైన అభినయంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న నటి నిత్యామీనన్ గురించి ఓ ఆసక్తికర వార్త హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా ఎప్పుడూ ముందుండే అమ్మ‌డు వ్యక్తిగత జీవితంపై తరచూ రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి. తాజాగా 35 ఏళ్ల టాలెంటెడ్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని నెట్టింట‌ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో నిత్యామీనన్ పెళ్లికి సంబంధించిన విషయాలపై పలు రకాల చర్చలు జ‌రుగుతున్నా? ఆమె కుటుంబ సభ్యుల నుంచి అందిన సంకేతాల మేరకు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇంత‌కాలం సినిమాల‌తో బిజీగా ఉన్ననిత్యామీన‌న్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయాలని నిర్ణయించు కున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యామీనన్ తల్లిదండ్రులు తగిన జోడీని వెతికే పనిలో పడ్డట్లు ప్రచారం జోరందుకుంది. కులమతాల కంటే మంచి మనసు, అండర్‌స్టాండింగ్ ఉన్న వ్యక్తి అయితే చాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు స‌మాచారం. నిత్యామీన‌న్ విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ పెద్ద‌గా పుకార్లు కూడా లేవు.

ఫ‌లానా హీరోతో ల‌వ్ లో ఉందంట‌? డేటింగ్ చేస్తుంద‌నే క‌థ‌నాలు అమ్మ‌డి కెరీర్ లో ఇంత వ‌ర‌కూ లేవు. అలాగ‌ని ప్రేమ‌కు...డేటింగ్ కు వ్య‌తిరేకం అని ఎన్న‌డు ప్ర‌క‌టించ‌లేదు. ఇంకా చెప్పాలంటే పెద్ద‌లు చూసిన కుర్రాడిని చేసుకోవ‌డం కంటే జీవిత భాగ‌స్వామిని మ‌న‌సుకు న‌చ్చిన వాడిని స్వ‌యంగా ఎవ‌రికి వారు వెతుక్కోవ‌డం... ఆ త‌ర్వాత కొంత కాలం పాటు క‌లిసి ఉండ‌టం...అభిప్రాయాలు మ్యాచ్ అయితే క‌లిసి ఉండ‌టం లేక‌పోతే విడిపోవ‌డం అనే విధానానికే నిత్యామీన‌న్ గ‌తంలో ఓటు వేసారు.

కానీ అమ్మ‌డి కెరీర్ లో మాత్రం ఇప్పుడు అందుకు భిన్నంగా స‌న్నివేశం క‌నిపిస్తుంది. కుర్రాడిని నిత్యా మీన‌న్ ఎంపిక చేసుకున ఛాన్స్ తీసుకోకుండా ఆ బాధ్య‌త‌ల్ని త‌ల్లిదండ్ర‌లుకు అప్ప‌గించిన‌ట్లు క‌నిపిస్తుంది. నిత్య సినిమాల విషయానికి వస్తే గ్లామర్ పాత్రల కంటే కథా బలమున్న పాత్రలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. `తిరుచిత్రబలం` వంటి చిత్రాలతో తన నటనతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న నిత్య తనకంటూ ప్రత్యేకమైన సినీ ప్రయా ణాన్ని ఏర్పరుచుకున్నారు. అలాగే ప‌లు టీవీ షోల‌కు హోస్ట్ గాను బాధ్య‌త‌లు వ‌హించి అక్క‌డా స‌త్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ - కోలీవుడ్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ రాదు.