Begin typing your search above and press return to search.

పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా: నిత్యా మీనన్

ఇప్పటి వరకు నాలుగు భాషల్లో 60కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన నిత్యా మీనన్.. తన నటనతో అద్భుతాలు సృష్టించింది.

By:  M Prashanth   |   11 Aug 2025 12:24 PM IST
పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా: నిత్యా మీనన్
X

హీరోయిన్ నిత్యామీనన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. వివిధ క్లాసిక్ రొమాంటిక్ మూవీస్ లో నటించిన ఆమె.. అన్ని భాషల సినీ ప్రియులను మనసు దోచేసిందనే చెప్పాలి.

ఇప్పటి వరకు నాలుగు భాషల్లో 60కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన నిత్యా మీనన్.. తన నటనతో అద్భుతాలు సృష్టించింది. ఏకంగా నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది అమ్మడు. ఇప్పుడు వివిధ సినిమాల్లో నటిస్తున్న నిత్యామీనన్ చాలా బిజీగా ఉంది. తరచూ ఆమె చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.

రీసెంట్ గా తన ఎందుకు పెళ్లి చేసుకోలేదో.. ఎందుకు మ్యారేజ్ కు దూరంగా ఉన్నానో వెల్లడించింది నిత్య. ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన ఆమె.. ఈసారి విఫలమైన ప్రతిసారి ప్రేమను మళ్ళీ నమ్మడం కష్టమని తెలిపింది. అదే ఇప్పటివరకు తాను వివాహం నుండి దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమంటూ చెప్పుకొచ్చింది.

అంతకుముందు మరో ఇంటర్వ్యూలో తాను వివాహం చేసుకోవాలని 4 సార్లు ప్రయత్నం చేశానని, కానీ చివర్లో వెనక్కి తగ్గానని తెలిపింది నిత్య. ప్రతిసారి లవ్ బ్రేక్ అయిందని, ఇప్పుడు వివాహం అనేది తన మొదటి ప్రాధాన్యత కాదని వెల్లడించింది. సామాజిక అంచనాలు, ఒత్తిడి నుండి ఇప్పుడు విముక్తి పొందినట్లు పేర్కొంది అమ్మడు.

తాను ఇప్పుడు సాంప్రదాయ ప్రేమ సంబంధాల వెలుపల ఆనందకర జీవితంతో సంతృప్తి చెందుతున్నానని తెలిపిన నిత్యా మీనన్.. ముఖ్యంగా ప్రేమ పేరుతో ఇప్పటికే ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని గుర్తు చేసుకుంది. అవన్నీ భావోద్వేగంతో కూడుకున్న దెబ్బలుు, ఆ అనుభవాలు తన ఆలోచనలను మార్చేశాయంటూ చెప్పుకొచ్చింది.

అయితే యువత పెళ్లి చేసుకోవాలని చెప్పే పెద్దలను కూడా అర్థం చేసుకోగలనని, కానీ తాను నైతిక ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని తెలిపింది. ఎప్పుడూ కూడా ఒంటరి వ్యక్తినేని, ఒకరితో సమయం గడపడం అనే భావన ఎప్పుడూ కలగలేదని పేర్కొంది. రిలేషన్ షిప్స్ అన్నీ కూడా విచారకరంగానే ముగిశాయని చెబుతున్న నిత్య.. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో వేచి చూడాలి.