17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి ఆర్డర్ మిస్సైంది!
చిత్ర పరిశ్రమలో నిత్యామీనన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి హీరోయిన్ గా రాణిస్తోంది. 1998 లో రిలీజ్ అయిన `హనుమాన్` సినిమాతో బాల నటిగా పరిచయమైంది.
By: Srikanth Kontham | 27 Dec 2025 12:00 PM ISTచిత్ర పరిశ్రమలో నిత్యామీనన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి హీరోయిన్ గా రాణిస్తోంది. 1998 లో రిలీజ్ అయిన `హనుమాన్` సినిమాతో బాల నటిగా పరిచయమైంది. అటుపై ఏడేళ్ల అనంతరం 2006 లో రిలీజ్ అయిన `7 ఓ క్లాక్` లో సపోర్టింగ్ రోల్ తో అలరించింది. హీరోయిన్ గా మాలీవుడ్ లో `ఆకాశ గోపురం`తో 2008 లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి నిత్యామీనన్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. మంచి పెర్పార్మర్ కావడంతో పాత్రల విషయంలో సెలక్టివ్ గా ఉండటం వంటి అంశాలు నిత్యామీనన్ కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి.
మలయాళంతో పాటు, తమిళ, కన్నడ భాషల్లోనూ చాలా చిత్రాల్లో నటించింది. `అలామొదలైంది` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. నాటి నుంచి తెలుగులోనూ ఎంతో బిజీగా కొనసాగుతుంది. మొత్తంగా నిత్యామీనన్ 17 ఏళ్ల జర్నీ పరిశీలిస్తే ఏడాదికో సినిమాతో ప్రేక్షకుల మధ్యలో ఉంది. 2008 నుంచి ఎక్కడా ఆర్డర్ మిస్ అవ్వకుండా సినిమాలతో అలరించింది. 2025 లోనూ మూడు రిలీజ్ లతో ప్రేక్షకుల్లోనే ఉంది. `కాధలిక్క నెరమల్లై`, `తలైవవాన్ తలైవీ`, ` ఇడ్లీ కడై` చిత్రాలతో మెప్పించింది. అయితే 2024లో మాత్రం అమ్మడు ఆర్డర్ మిస్ అయిందన్నది క్లియర్.
ఆ ఏడాది మాత్రం నిత్యామీనన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయింది. 2023 లో `కోల్లాంబీ`నిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత మాత్రం ఎలాంటి కమిట్ మెంట్లు లేకుండా ఖాళీగా ఉంది. 2024లో కమిట్ అయిన చిత్రాలనే 2025లో రిలీజ్ అయ్యాయి. ఆ మూడు చిత్రాలు కూడా కోలీవుడ్ లో చేసినవే. మాలీవుడ్, టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే? మూడేళ్లగా నిత్యా మీనన్ టాలీవుడ్ కి దూరంగానే ఉంది. 2022 లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `భీమ్లా నాయక్` లో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
కానీ నిత్యామీనన్ మాత్రం కొత్త అవకాశాలు అందుకోలేకపోయింది. మరి కొత్త ఏడాదిలో కొత్త అవకాశాల అప్ డేట్ ఏదైనా ఇస్తుందా? అన్నది చూడాలి. అయితే నిత్యామీనన్ నటిగా ప్రస్థానం మొదలైన నాటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది. నటిగా కొన్ని పరిమితులకు లోబడే పని చేసింది. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమని తెలిసినా? గీత మాత్రం ఎన్నడు దాటలేదు. 17 ఏళ్ల ప్రయాణాన్ని అలాగే కొనసాగించింది. టెలివిజన్ షోస్, మ్యూజిక్ షోస్ హోస్టింగ్ లోనూ తనదైన ముద్ర వేసింది.
