Begin typing your search above and press return to search.

హీరో, డైరెక్టర్ చాలా ట్రై చేశారు!: నిత్యా మీనన్

ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. హైదరాబాద్ లో సందడి చేసింది అమ్మడు. తన పెళ్లి గురించి మాట్లాడే సమయంలో మాట జారి మళ్లీ క్లారిటీ ఇచ్చింది.

By:  M Prashanth   |   30 July 2025 3:38 PM IST
హీరో, డైరెక్టర్ చాలా ట్రై చేశారు!: నిత్యా మీనన్
X

హీరోయిన్ నిత్యామీనన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వివిధ సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్న అమ్మడికి టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది.

అయితే ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ సార్ మేడమ్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది నిత్యా మీనన్. నిజానికి.. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఆ సినిమా తెలుగులో కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. మేకర్స్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నారు.

ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. హైదరాబాద్ లో సందడి చేసింది అమ్మడు. తన పెళ్లి గురించి మాట్లాడే సమయంలో మాట జారి మళ్లీ క్లారిటీ ఇచ్చింది. తెలుగులో మాట్లాడుతూ సరిగ్గా చెప్పే క్రమంలో.. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రెస్ మీట్ లో నిత్యా మీనన్ కు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. అప్పుడు తనను విజయ్ సేతుపతి, సార్ మేడమ్ మూవీ దర్శకుడు చాలా ట్రై చేశారంటూ వ్యాఖ్యానించింది. దీంతో వెంటనే విజయ్ సేతుపతి కలగజేసుకున్నారు. సరిగా చెప్పమ్మ లేదంటే వేరే అర్థాలు వస్తాయని అన్నారు. ఆ తర్వాత నిత్యా క్లారిటీ ఇచ్చింది.

తన ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చింది. విజయ్ సేతుపతి, పాండిరాజ్ నన్ను మ్యారేజ్ విషయంలో మోటీవేట్ చేస్తూ ఉంటారని చెప్పాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. అయ్యోయ్యో నిత్య.. అంటూ ఫన్నీ ఇమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. సార్ మేడమ్ తో ఇప్పటికే కోలీవుడ్ లో అలరిస్తున్న నిత్యా మీనన్.. టాలీవుడ్ లో కూడా మంచి హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వగా.. ఇప్పుడు మేకర్స్ ఫుల్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సినిమాపై హైప్ పెంచేలా చూస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.