Begin typing your search above and press return to search.

క్రేజీ కాన్సెప్ట్ తో నితిన్ 36

నితిన్ ముఖం నుంచి వస్తున్న పొగ, అందులో కనిపిస్తున్న సిటీ విజువల్స్ చూస్తుంటే దర్శకుడు విఐ.ఆనంద్ ఒక విజువల్ వండర్‌ను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   25 Jan 2026 3:50 PM IST
క్రేజీ కాన్సెప్ట్ తో నితిన్ 36
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ తో అలరించిన నితిన్.. ఈసారి ఒక క్రేజీ సైన్స్ ఫిక్షన్ డ్రామాతో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీసే దర్శకుడు విఐ.ఆనంద్ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తుండటంతో పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతోంది. రథ సప్తమి సందర్భంగా ఆదివారం ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

నితిన్ కెరీర్‌లో ఇది 36వ సినిమా. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఊరు పేరు భైరవకోన' వంటి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు విఐ.ఆనంద్. ఇప్పుడు నితిన్ కోసం ఒక హై కాన్సెప్ట్ సైఫై కథను సిద్ధం చేశారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌పై ఉన్న "NO BODY NO RULES" డిఫరెంట్ గా ఉంది. నితిన్ ముఖం నుంచి వస్తున్న పొగ, అందులో కనిపిస్తున్న సిటీ విజువల్స్ చూస్తుంటే దర్శకుడు విఐ.ఆనంద్ ఒక విజువల్ వండర్‌ను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నితిన్ క్యారెక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉండబోతోందని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

ప్రస్తుతం నితిన్ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా.. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం వైపు మొగ్గు చూపడం విశేషం. ఆనంద్ సినిమాల్లో ఉండే విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నితిన్ ఎనర్జీకి తోడైతే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ కాంబో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో నితిన్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని టాక్. సైన్స్ ఫిక్షన్ జోనర్ కాబట్టి గ్రాఫిక్స్ కు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. నితిన్ కెరీర్ లోనే ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు.

నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.

అందుకే రొటీన్ కథలకు భిన్నంగా వి.ఐ.ఆనంద్ ఈ సబ్జెక్టును పక్కాగా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. ఇక ఈ సైఫై ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.