Begin typing your search above and press return to search.

నీరజతో నితిన్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

దీంతో నితిన్.. కొత్త సినిమా ఎవరితో చేస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే దర్శకురాలు నీరజ కోన.. నితిన్ తో సినిమా చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.

By:  M Prashanth   |   10 Dec 2025 1:00 AM IST
నీరజతో నితిన్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వరుస విజయాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు సక్సెస్ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు నితిన్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. వరుసగా ఆరు డిజాస్టర్లు పడ్డాయి.

దీంతో నితిన్ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారోనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఆయన మార్కెట్ బాగా డౌన్ అవ్వగా.. కచ్చితంగా హిట్ పడాల్సిన అవసరం ఉంది. కానీ నితిన్ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి.. ఇప్పుడు ఆయన వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీ చేయాల్సి ఉంది.

కానీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అనుకున్న సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్లతో అనుకున్న ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ డైరెక్షన్ లో మూవీ చేస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.

దీంతో నితిన్.. కొత్త సినిమా ఎవరితో చేస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే దర్శకురాలు నీరజ కోన.. నితిన్ తో సినిమా చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ఆమె.. తెలుసు కదా మూవీతో డైరెక్టర్ గా మారారు. రాడికల్ లవ్ స్టోరీతో రూపొందించిన ఆ సినిమా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది.

కొందరికి మూవీ నచ్చినా.. కమర్షియల్ గా వర్కౌట్ మాత్రం అవ్వలేదు. ఇప్పుడు నితిన్ తో మంచి లవ్ స్టోరీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నితిన్.. ఈసారైనా హిట్ అందుకుంటారా అని మాట్లాడుకుంటున్నారు.

నిజానికి.. లవ్ స్టోరీలు నితిన్ కు బాగా కలిసి వస్తాయనే చెప్పాలి. గతంలో వరుస ప్లాప్స్ తో సతమతమైన నితిన్.. లవ్ స్టోరీ జోనర్ లో తెరకెక్కిన ఇష్క్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత గుండె జారి గల్లంతైందే సినిమాతో కూడా మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్స్ ను అందుకున్నారు. కాబట్టి నీరజ కోనతో చేయబోయే సినిమాతో మ్యాజిక్ రిపీట్ అయితే నితిన్ కెరీర్ గాడిలో పడుతుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.