Begin typing your search above and press return to search.

దారిమళ్ళిన నితిన్.. ఈ సారైనా సక్సెస్ అవుతారా?

జయం, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, సై వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించిన నితిన్.. సినీ కెరియర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయిందని చెప్పుకోవచ్చు.

By:  Madhu Reddy   |   13 Oct 2025 11:50 AM IST
దారిమళ్ళిన నితిన్.. ఈ సారైనా సక్సెస్ అవుతారా?
X

జయం, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, సై వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా నటించిన నితిన్.. సినీ కెరియర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈయన గత కొద్ది రోజుల నుండి చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగిస్తున్నాయి. దీంతో నితిన్ అభిమానులు కూడా చాలా నిరాశలో ఉన్నారు. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడంతో నితిన్ ఇక సినిమాలు మానుకొని వేరే పని చేసుకోవడం మంచిదని ఎంతోమంది ఆయన్ని విమర్శిస్తున్నారు.

అందుకే అర్జెంటుగా నితిన్ హిట్టు కొట్టకపోతే ఆయన కెరియర్ ప్రశ్నార్థకంగా మారబోతుందనే వార్తలు వినిపిస్తున్న వేళ.. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' మూవీ డైరెక్టర్ తో నితిన్ కొత్త సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. మౌళి తనూజ్, శివాని నాగారంలతో లిటిల్ హార్ట్స్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సాయి మార్తాండ్ చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమాలోని కామెడీ,యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ సినిమాలను పక్కకునెట్టి తన సత్తా చూపించింది. అయితే అలాంటి లిటిల్ హార్ట్స్ మూవీకి డైరెక్షన్ చేసిన సాయి మార్తాండ్ తో నితిన్ కొత్త మూవీ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ రీసెంట్ గానే నితిన్ ని కలిసి స్టోరీ చెప్పారట. అయితే డైరెక్టర్ చెప్పిన స్టోరీ నితిన్ కి బాగా నచ్చడంతో ఆయన కూడా చేయడానికి ఒప్పుకున్నారట. పైగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని, కామెడీ డ్రామా స్క్రిప్ట్ జానర్లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కామెడీ జానర్లో వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే జనార్లో మళ్ళీ నితిన్ తో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి పుష్కర రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ లు నిర్మాతలుగా చేస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది అభిమానులు ఈ సినిమా నితిన్ చేయాలని, వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడుతున్న నితిన్ కి ఇది మంచి ఛాన్స్ అని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు నితిన్,సాయి మార్తాండ్ కాంబోలో సినిమా వస్తుందని రూమర్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్ గా బయట పడలేదు. మరి వీరిద్దరి మధ్య చర్చలు సఫలం అవుతాయా.. నితిన్ కెరియర్ గాడిన పడుతుందా అనేది చూడాలి.

మరోవైపు రీసెంట్గా నితిన్ బలగం వేణు ఎల్లమ్మ మూవీలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నారు.కానీ ప్రస్తుతం నితిన్ ఇందులో నుండి తప్పుకోవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా చేస్తున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నితిన్ ఆ మధ్యకాలంలో ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో స్వారీ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాకి ఓకే చెప్పారు.కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. అందుకే సక్సెస్ కోసం ఆరాటపడుతూ యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడానికి తన దారిని మళ్లించుకున్నారు. మరి చూడాలి లిటిల్ హార్ట్స్ మూవీ డైరెక్టర్ తో నితిన్ కొత్త సినిమా ఉండబోతుందా.. ? వుంటే ఈ సినిమాతోనైనా నితిన్ సక్సెస్ అవుతాడా? అనేది..