Begin typing your search above and press return to search.

నితిన్ అన్న.. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావ్?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Oct 2025 12:00 AM IST
నితిన్ అన్న.. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావ్?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి జయం మూవీతో వచ్చిన ఆయన.. డెబ్యూతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత దిల్ మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ సై సినిమాలో నటించి తెలుగు సినీ ప్రియులను ఫుల్ గా అలరించారు.

కానీ సై సినిమా తర్వాత.. నితిన్ 12 ఫ్లాపులు మూటగట్టుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు హిట్ దక్కకపోయినా.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో ఆకట్టుకున్నారు. అ ఆ, భీష్మ వంటి చిత్రాలతో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ సొంతం చేసుకుని హిట్ ట్రాక్ ఎక్కారు.

ఆ తర్వాత మళ్లీ చెక్, రంగ్‌ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ ట్రా ఆర్డనరీ మ్యాన్, రాబిన్‌ హుడ్, తమ్ముడు సినిమాలతో వరుసగా ఆరు ఫ్లాపులతో మళ్లీ కెరీర్ లో వెనుకబడ్డారు. చివరి మూవీ తమ్ముడు అయితే భారీ నష్టాలు తీసుకొచ్చింది. హిట్ అండ్ ఫ్లాపులు నితిన్ కెరీర్ లో అలవాటు అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

ఎందుకంటే తమ్ముడు మూవీ తర్వాత నితిన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు లేదు. ఇప్పటికే ఫిక్స్ అయిన ప్రాజెక్టులు కూడా డ్రాప్ అయిపోతున్నాయి. చిత్ర దర్శక నిర్మాతలు నితిన్ బదులు.. వేరే హీరోలను అప్రోచ్ అవుతున్నారు. దీంతో అసలేం జరుగుతుందో.. ఏం చేస్తున్నావ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

నెక్స్ట్ ఏ మూవీలో నటిస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. సరైన హిట్ అందుకుని కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. నిజానికి తమ్ముడు మూవీ తర్వాత ఎల్లమ్మ మూవీ చేయాల్సి ఉంది నితిన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను నిర్మించనుండగా.. ఆయనే నితిన్ హీరోగా ఎల్లమ్మ చేస్తున్నానని అనౌన్స్ చేశారు. కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు.

ఇప్పుడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎల్లమ్మ మూవీ చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో ఇష్క్ తో మంచి హిట్ అందించిన విక్రమ్ కుమార్.. స్వారీ మూవీని నితిన్ తో చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఆ సినిమా విషయంలో యూవీ క్రియేషన్స్ వెనకడుగు వేస్తుందని సమాచారం. దీంతో ఆ ప్రాజెక్టు ముందుకెళ్లడం డౌటే.

90స్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్.. నితిన్ తో వర్క్ చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వేరే హీరోతో ఆదిత్య.. నితిన్ తో అనుకున్న సినిమా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సాయి మార్తాండ్ తో నితిన్ ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో క్లారిటీ లేదు. ఏదేమైనా నితిన్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారో.. ఎప్పుడు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.