Begin typing your search above and press return to search.

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ నుంచి కొత్త ప్రమోషనల్ వీడియో విడుదలైంది. ఇందులో పదేళ్లు వెనక్కి వెళ్లిన కాలేజ్ కుర్రాడి లుక్‌లో నితిన్ కనిపించి ఆశ్చర్యపరిచాడు. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ జీవితంలోని రెండు దశలను చూపించనున్నారు. దీప్తి గంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

By:  M Prashanth   |   7 Nov 2026 7:22 PM IST
టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. రుక్మిణి కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!
X

హీరో నితిన్ ఈమధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను లైన్ లో పెడుతూ వస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో నటిస్తున్న నెక్స్ట్ మూవీ అలియాస్ రుక్మిణి. దండోరా ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. అందులో నితిన్ లుక్ చూసి నెటిజన్లతో పాటు మూవీ లవర్స్ కూడా కాస్త ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోను డిజైన్ చేసిన విధానం కూడా డిఫరెంట్ గానే ఉంది. హీరోయిన్ ఆఫియా సయ్యద్, డైరెక్టర్ మురళీ కాంత్ ఇద్దరూ కృష్ణ పాత్ర పాత రోజుల గురించి సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. పదేళ్ల క్రితం కృష్ణ ఎలా ఉండేవాడో చూడాలని ఉందంటూ హీరోయిన్ అడగ్గానే, నితిన్ సడన్ గా స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తాడు. ఆ లుక్ చూడగానే హీరోయిన్ నిజంగానే షాక్ అయిపోయి, ఏదైనా టైమ్ మెషీన్ వాడి వచ్చావా అంటూ కామెంట్ చేస్తుంది.

నిజంగానే ఇందులో నితిన్ మేకోవర్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. పదేళ్లు వెనక్కి వెళ్లి కాలేజ్ కుర్రాడిలా చాలా యంగ్ గా మారిపోయాడు. నార్మల్ గా ఇలాంటి లుక్స్ ట్రై చేసినప్పుడు మేకప్ ఎక్కువై కొందరికి ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటుంది. కానీ ఇందులో నితిన్ హెయిర్ స్టైల్, లైట్ మీసకట్టు, పక్కింటి కుర్రాడిలాంటి అమాయకత్వం చాలా నేచురల్ గా కుదిరాయి. కథలో ఈ యంగ్ ఫేజ్ చాలా కీలకంగా ఉండబోతోందని అర్థమవుతుంది.

సినిమాలో కృష్ణ లైఫ్ లో రెండు వేర్వేరు దశలు ఉంటాయని ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. గతంలో కోర్టు బ్యాక్‌డ్రాప్‌లో కాస్త సీరియస్ గా కనిపించిన నితిన్, దానికి ముందు కాలేజీ రోజుల్లో ఎలా ఉన్నాడనేది ఈ కొత్త లుక్ ద్వారా పరిచయం చేశారు. చివర్లో రిలీజ్ చేసిన పోస్టర్ లో క్లాస్ రూమ్ లో కూర్చున్న స్టూడెంట్ గా నితిన్ బాడీ లాంగ్వేజ్ కూడా క్యారెక్టర్ మూడ్‌కు పక్కాగా సింక్ అయినట్లు కనిపిస్తోంది.

దీప్తి గంట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో మొదటి నుంచి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ నుంచి డీసెంట్ రెస్పాన్స్ అందుకున్నాయి. కంటెంట్ బేస్డ్ కథలకు నాని బ్రాండ్ తోడైతే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రమోషన్ల విషయంలో కూడా నార్మల్ అప్‌డేట్స్ లా కాకుండా ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌లతో రావడం సినిమాకి మంచి బజ్ తీసుకొస్తోంది.

డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ కెరీర్ లో రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి చేసిన ప్రయోగం లాగా ఇది కనిపిస్తోంది. పదేళ్ల కుర్రాడిలా కనిపించే ఈ లుక్ తో పాటు సినిమాలో కంటెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సరైన పబ్లిసిటీతో జనాల్లోకి తీసుకెళ్లగలిగితే డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఒక మంచి చాయిస్ అయ్యే అవకాశముంది.