నితిన్ ను గట్టెక్కించేది అతనేనా?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు హిట్ అనేది అందని ద్రాక్షలా మారింది. గత కొన్ని సినిమాలుగా నితిన్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Sept 2025 1:24 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు హిట్ అనేది అందని ద్రాక్షలా మారింది. గత కొన్ని సినిమాలుగా నితిన్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న నితిన్, మరో మంచి హిట్ కొట్టలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మ్యాస్ట్రో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
వరుస ఫ్లాపుల్లో నితిన్
దీంతో ఛలో లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి రాబిన్‌హుడ్ చేస్తే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా అయితే గట్టి ఫ్లాపుగా నిలిచింది. దీంతో నితిన్ మార్కెట్ కు పెద్ద డ్యామేజే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిట్ కోసం నితిన్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
విక్రమ్ తో స్వారీకి నితిన్ రెడీ
ఆ ప్రయత్నంలో భాగంగానే నితిన్ తన తర్వాతి సినిమా కోసం తనకు ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన విక్రమ్ కె. కుమార్ తో చేతులు కలపడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు స్వారీ అనే టైటిల్ ను పెట్టినట్టు సమాచారం. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సినిమా లాక్ అయిపోయిందని, ఈ మూవీలో కేవలం క్రీడా అంశాలను మాత్రమే కాకుండా రిలేషన్‌షిప్స్, హ్యూమన్ ఎమోషన్స్ పై కూడా విక్రమ్ ఫోకస్ చేశారని తెలుస్తోంది.
టాలీవుడ్ గర్వపడే సినిమా
ఒకప్పుడు నితిన్ ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి, తనను హిట్ ట్రాక్ ఎక్కించిన విక్రమ్ కుమార్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిస్తారని నితిన్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. హను మాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే గతంలో నితిన్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ అన్నీ అనుకున్నట్టు జరిగి కథ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఈ మూవీ టాలీవుడ్ గర్వపడే సినిమా అవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇష్క్ తర్వాత ఇన్నేళ్లకు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి హైప్ ఏర్పడే ఛాన్సుంది. మరి విక్రమ్ మరోసారి నితిన్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తారో లేదో చూడాలి.
