నితిన్ ఇంట్లో సైలెంట్ సెలెబ్రేషన్స్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వ్యక్తిగత జీవితం విషయంలో చాలా ప్రైవసీగా ఉండేందుకు ఇష్టపడతారు.
By: M Prashanth | 7 Sept 2025 12:09 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వ్యక్తిగత జీవితం విషయంలో చాలా ప్రైవసీగా ఉండేందుకు ఇష్టపడతారు. సినిమాల ప్రమోషన్స్ మినహా ఆయన ఫ్యామిలీ మూమెంట్స్ చాలా అరుదుగానే బయటకు వస్తాయి. ఇక రీసెంట్ గా ఆయన కొడుకు అవ్యుక్త్ ఫస్ట్ బర్త్‌డే జరిగింది.
అవ్యుక్త్ మొదటి పుట్టినరోజు వేడుక ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. కేవలం కొద్ది మంది గెస్టులు, సన్నిహితుల మధ్య ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ జరిగింది. ఎక్కువగా హడావుడి చేయకుండా, క్లోజ్ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్‌తో మాత్రమే పార్టీని ప్లాన్ చేశారు. ఈ వేడుకలో తీసిన ఫొటోలు ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వాటిలో నితిన్, ఆయన భార్య శాలినీ ఆనందంగా కనిపించారు. ఒక ఫొటోలో శాలినీ తన భర్తకు ముద్దు పెట్టడం, మరో ఫొటోలో నీరజతో క్యూట్ సెల్ఫీ తీయడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాయి. పార్టీ డెకరేషన్ చాలా సింపుల్ అయినప్పటికీ అందంగా కనిపించింది. “ONE” లైట్ బోర్డు, అవ్యుక్త్ పేరు లెటర్స్, గ్రీన్ థీమ్ సెటప్ మొత్తం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ నితిన్ ఫ్యామిలీకి హ్యాపీ విషెస్ తెలియజేస్తూ, అవ్యుక్త్ ఫస్ట్ బర్త్‌డేకు ప్రేమతో కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన ఈ వేడుక ఫ్యామిలీ బాండింగ్‌ను చూపించింది. మొత్తానికి, నితిన్ కొడుకు అవ్యుక్త్ పుట్టినరోజు గ్రాండ్ హంగామా లేకపోయినా, అందమైన ఫ్యామిలీ మూమెంట్స్‌తో నిండిపోయి, అభిమానులకు హృదయాన్ని తాకేలా మారింది.
ఇక నితిన్ ఇటీవల వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో బలగం వేణు దర్శకత్వంలో మరో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. అలాగే నితిన్ ఇష్క్ దర్శకుడు విక్రమ్ దర్శకత్వంలో కూడా మరో స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు.
