Begin typing your search above and press return to search.

నితిన్ కొత్త సినిమా స్టార్ట్… సితారతో క్రేజీ కాంబో రెడీ!

మొదటి అనౌన్స్‌మెంటే ఈ ప్రాజెక్ట్‌ను హాట్ టాపిక్‌గా మార్చగా, పూజా కార్యక్రమం తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 May 2026 3:56 PM IST
నితిన్ కొత్త సినిమా స్టార్ట్… సితారతో క్రేజీ కాంబో రెడీ!
X

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. యంగ్ హీరో నితిన్ తన త‌ర్వాతి సినిమాను పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించగా, చిత్ర బృందం మొత్తం హాజరై ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తపరిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో నితిన్ క్రేజీ ప్రాజెక్టు అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ఇప్పటికే సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి అనౌన్స్‌మెంటే ఈ ప్రాజెక్ట్‌ను హాట్ టాపిక్‌గా మార్చగా, పూజా కార్యక్రమం తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి.




ప్రత్యేకంగా ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం నితిన్- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ అనే చెప్పాలి. గతంలో నాణ్యమైన మరియు స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, ఇప్పుడు మ‌రోసారి నితిన్‌తో చేతులు కలపడం విశేషంగా మారింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కు ప్రేక్షకుల్లో ఉన్న విశ్వసనీయత ఈ సినిమాకు ప్రారంభం నుంచే భారీ ప్లస్‌గా నిలుస్తోంది. ఈ సంస్థ రూపొందించిన సినిమాలు సాధారణంగా కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అదే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడంతో, ఈ కాంబినేషన్ మరింత బలపడింది.




ఈ సినిమాకు నారి సిరిసవాడ, సోమశేఖర్ టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొత్త ఆలోచనలు, ఫ్రెష్ విజన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ డైరెక్టర్ జంట, నితిన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొత్త తరహా కథను తీసుకురానున్నారని సమాచారం. మరోవైపు రితికా నాయక్ హీరోయిన్ గా ఎంపికవడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. నితిన్‌కు కొత్త జోడీగా ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా బలంగా కనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, అనిత్ మద్దాడి సినిమాటోగ్ర‌ఫీ. జానీ షేక్ ఆర్ట్ డైరెక్షన్ ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమాను విజువ‌ల్ గా కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నాయి. ఈ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ సినిమాకు మరింత విలువను జోడిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వ‌ర్క్స్ పూర్తయ్యాయని, మే రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా నితిన్ కెరీర్‌లో ఈ సినిమా మరో కీలక మలుపు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మంచి కాంబినేషన్, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, విశ్వసనీయ నిర్మాణ సంస్థ‌, ఈ ప్రాజెక్టును ప్రారంభం నుంచే భారీ అంచనాల మధ్య నిలిపాయి. పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా మొదలైన ఈ సినిమా, అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందా అన్నది చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.