Begin typing your search above and press return to search.

ఎల్ల‌మ్మ‌పై త‌మ్ముడు ప్ర‌భావం?

రీసెంట్ గా త‌మ్ముడు సినిమాతో దారుణ‌మైన డిజాస్ట‌ర్ ను అందుకున్న నితిన్ కెరీర్ ప్ర‌స్తుతం చాలా డ‌ల్ గా న‌డుస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Aug 2025 8:00 PM IST
ఎల్ల‌మ్మ‌పై త‌మ్ముడు ప్ర‌భావం?
X

రీసెంట్ గా త‌మ్ముడు సినిమాతో దారుణ‌మైన డిజాస్ట‌ర్ ను అందుకున్న నితిన్ కెరీర్ ప్ర‌స్తుతం చాలా డ‌ల్ గా న‌డుస్తుంది. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ ఇప్ప‌టివ‌ర‌కు చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ వాటిలో భీష్మ త‌ప్ప మ‌రోటి హిట్ అవ‌లేదు. మ‌ధ్య‌లో చేసిన చెక్, రంగ్‌దే, మ్యాస్ట్రో, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్, రాబిన్ హుడ్ అవ‌న్నీ ప్లాపులుగా నిలిచిన‌వే.

నితిన్ నెక్ట్స్ అత‌నితోనే..

మ‌ధ్య‌లో మంచి డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసినా ఏవీ నితిన్ కు హిట్ ను అందించ‌లేదు. అయితే ప్ర‌స్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలుండ‌గా వాటిపైనే నితిన్ కెరీర్ డిపెండై ఉంది. అందులో ఒక సినిమా బ‌ల‌గం ఫేమ్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఎల్ల‌మ్మ కాగా ఇంకోటి త‌న‌కు ఇష్క్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందించిన విక్ర‌మ్ కె. కుమార్ తో సినిమా.

ఎల్ల‌మ్మ‌పై త‌మ్ముడు ప్ర‌భావం

అయితే త‌మ్ముడు సినిమా ఎఫెక్ట్ తో ఎల్లమ్మ సినిమా కాస్త వెన‌క్కి వెల్లింద‌ని, నితిన్ త‌ర్వాత చేయ‌బోయే సినిమా విక్ర‌మ్ తోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇష్క్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై మంచి అంచ‌నాలుండ‌టం స‌హ‌జమే. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడ‌ర్ గా నెవ‌ర్ బిఫోర్ లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.

నితిన్ కెరీర్లో భారీగా

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నుంద‌ని, నితిన్ కెరీర్లోనే ఎక్కువ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు. నితిన్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌లు ఈ క‌థ‌పై న‌మ్మ‌కంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కూడ‌ద‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మొద‌లుపెట్టి 2026లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రానికి స్వారీ అనే టైటిల్ ను మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుంది.