ఆ హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్
టాలీవుడ్ లో తమకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 1:08 PM ISTటాలీవుడ్ లో తమకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కూడా ఒకరు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విఐ ఆనంద్. ఆయన నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన.
ఊరు పేరు భైరవకోనతో మంచి హిట్
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఊరు పేరు భైరవకోన మంచి హిట్ గా నిలవగా, ఆ తర్వాత విఐ ఆనంద్ నుంచి మరో సినిమా వచ్చింది లేదు. తన రైటింగ్, డైరెక్షన్ తో డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న ఆయన తన తర్వాతి సినిమాను రీసెంట్ గా ఓ సందర్భంలో వెల్లడించారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో తన తర్వాతి సినిమా ఉంటుందని చెప్పారు.
నితిన్ తో సినిమాను అనౌన్స్ చేసిన విఐ ఆనంద్
అల్లరి నరేష్ హీరోగా నటించిన రైల్వే కాలనీ ఈవెంట్ కు హాజరైన ఆనంద్ ఈ విషయాన్ని బయటపెట్టారు. తన తర్వాతి సినిమా నితిన్ తో ఉంటుందని, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లోనే ఆ సినిమా ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఆల్రెడీ ప్రాజెక్టు ఓకే అయిందని, నితిన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు విఐ ఆనంద్.
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో నితిన్
అయితే గత కొన్ని సినిమాలుగా నితిన్ ఏ సినిమా చేసినా అవి ఫ్లాపులుగానే నిలుస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రాబిన్‌హుడ్, తమ్ముడు సినిమాలు కూడా నితిన్ కు ఊహించిన విధంగా సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. తమ్ముడు తర్వాత వేణు దర్శకత్వంలో చేయాల్సిన ఎల్లమ్మ ప్రాజెక్టు క్యాన్సిల్ కాగా ఇప్పుడు విఐ ఆనంద్ తో సినిమా అంటున్నారు. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అయినా నితిన్ కు హిట్ ఇస్తారేమో చూడాలి.
