Begin typing your search above and press return to search.

నితిన్ లైనప్ లో కనిపిస్తున్న ఆ బిగ్ చేంజ్ ఏంటి?

ఇక ఈ కొత్త కాంబినేషన్ల గేమ్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

By:  M Prashanth   |   11 July 2026 10:25 AM IST
నితిన్ లైనప్ లో కనిపిస్తున్న ఆ బిగ్ చేంజ్ ఏంటి?
X

ఒక సినిమా రిజల్ట్ తేడా కొడితే చాలు, హీరోల మార్కెట్ ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. ముఖ్యంగా వరుసగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆశించిన స్థాయిలో ఆడనప్పుడు, నెక్స్ట్ స్క్రిప్ట్స్ సెలెక్షన్ లో ఎలాంటి అడుగులు వేస్తున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. హీరో నితిన్ రీసెంట్ లైనప్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. భీష్మ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఈ లవర్ బాయ్, ఇప్పుడు సీనియర్ దర్శకుల కంటే ఎక్కువగా కొత్త తరం మేకర్స్ వైపు మొగ్గు చూపుతుండటం హైలెట్.

ప్రస్తుతం నితిన్ లైన్ లో పెట్టిన ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే ఒక బిగ్ చేంజ్ కనిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నరి-సోము అనే డెబ్యూ దర్శకులతో ఒక సినిమా చేస్తుండగా, నాని వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో దండోరా ఫేమ్ మురళి కాంత్ తో మరో ప్రాజెక్ట్ కి రెడీ అయ్యాడు. దీనితో పాటు 'ఆయ్' సినిమాతో హిట్ కొట్టిన అంజి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ లో మరో సినిమా డిసెంబర్ నుండి ట్రాక్ ఎక్కబోతోంది.

ఈ లైనప్ అంతా గమనిస్తే నితిన్ కంప్లీట్ గా యంగ్ బ్లడ్ ని నమ్ముకున్నాడనే విషయం తెలుస్తోంది. పెద్ద డైరెక్టర్ల కాంబినేషన్ల కంటే ఇలాంటి యంగ్ మేకర్స్ ని లైన్ లో పెట్టడం వెనుక బలమైన కమర్షియల్ లెక్కలు ఉంటాయనేది ట్రేడ్ టాక్. కొత్త దర్శకులు లేదా ఒకే ఒక్క హిట్ లో ఉన్న యంగ్ మేకర్స్ రాసే స్క్రిప్ట్స్ లో నేటి తరం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఐడియాలు ఎక్కువగా ఉంటాయి.

రొటీన్ మాస్ బిల్డప్‌ల జోలికి వెళ్లకుండా, కథలోని కంటెంట్ ని నమ్మి సినిమాలు తీసే స్కోప్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. పైగా సితార, శ్రేష్ట్ మూవీస్ లాంటి క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ సపోర్ట్ ఉండటం వల్ల ప్రాజెక్ట్స్ పై బిజినెస్ పరంగా కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ తరహా ప్రయోగాలు నితిన్ కి ఎంతవరకు సేఫ్ జోన్ ఇస్తాయనేది ఇప్పుడే బల్లగుద్ది చెప్పలేం.

ఎందుకంటే డెబ్యూ మేకర్స్ కి మేకింగ్ పరంగా బోలెడు ప్లస్ లు ఉన్నప్పటికీ, థియేటర్ కి జనాలను రప్పించే విషయంలో కమర్షియల్ ఈక్వేషన్స్ ఒక్కోసారి తలకిందులు కావచ్చు. గతంలో నితిన్ కెరీర్ లో కొన్ని ప్రయోగాత్మక అటెంప్ట్స్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ, రొట్ట ఫార్ములా కథలతో రిస్క్ చేయడం కంటే ఇలాంటి కొత్త ఆలోచనలు ఉన్న దర్శకులతో ట్రావెల్ అవ్వడం వల్ల నటుడిగా తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకునే అవకాశం మాత్రం దక్కుతుంది.

ఇక ఈ కొత్త కాంబినేషన్ల గేమ్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఈ ప్రయోగాలు సక్సెస్ కావు అని ముందే డిసైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. టాలీవుడ్ లో మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా నితిన్ తన లైనప్ ని పక్కాగా రీడిజైన్ చేసుకుంటున్నాడు అనేది మాత్రం కనిపిస్తోంది. రాబోయే ఈ మూడు ప్రాజెక్టులు అతని కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తాయో చూడాలి.