Begin typing your search above and press return to search.

ఎవరు ఈ రుక్మిణీ మేడం తెలుసా..?

నితిన్‌ హీరోగా నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో మురళీకాంత్‌ దేవాసోత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'.

By:  Ramesh Palla   |   14 Oct 2026 12:03 PM IST
ఎవరు ఈ రుక్మిణీ మేడం తెలుసా..?
X

నితిన్‌ హీరోగా నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో మురళీకాంత్‌ దేవాసోత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. నాని మెచ్చిన కథ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా నితిన్‌కి ఈ సినిమా పెద్ద కమర్షియల్‌ హిట్‌ ఇవ్వబోతుందనే విశ్వాసంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ అయిన రుక్మిణీ పాత్రలో బాలీవుడ్‌ నటి ఆఫియా సయ్యద్‌ నటించడం చర్చనీయాంశంగా మారింది. ఆఫియా కొత్త అమ్మాయి కాదు, ఇండస్ట్రీలో ఆమెకు ఫ్యామిలీ కారణంగా గుర్తింపు ఉంది. ఆమె ఫ్యామిలీ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థను నిర్వహించడం ద్వారా ఆమెకు బాలీవుడ్‌ డెబ్యూ ఈజీగానే దక్కింది. హిందీలో ఆఫియా సయ్యద్‌ ఇటీవలే 'ప్రేమ్‌ కీటాను' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'ప్రేమలు' సినిమాకు ప్రేమ్‌ కిటాను మూవీ రీమేక్‌.

ఆఫియా ప్రేమ్‌ కిటాను సినిమాతో...

ప్రేమ్‌ కిటాను సినిమాలోని ఆఫియా సయ్యద్‌ నటకు మంచి మార్కులు దక్కాయి. ఒరిజినల్‌ వర్షన్‌లో హీరోయిన్‌ మాదిరిగానే బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆఫియా ఆకట్టుకుంటుంది అంటూ రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్‌లో మొదటి సినిమా విడుదల కాకుండానే టాలీవుడ్‌లో సినిమా ఛాన్స్ ను ఆఫియా దక్కించుకుంది. నితిన్‌ తో రుక్మిణీ పాత్రలో ఆఫియా నటించడం ద్వారా కచ్చితంగా టాలీవుడ్‌లో ముందు ముందు స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అలియాస్ రుక్మిణీ సినిమాకు సంబంధించిన ఆమె లుక్‌ ను రివీల్‌ చేస్తూ, పాత్రను పరిచయం చేయడం జరిగింది. సీరియస్‌, అండ్‌ బ్యూటీఫుల్‌ స్కూల్‌ టీచర్‌ పాత్రలో ఆఫియా కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అలియాస్‌ రుక్మిణీ సినిమా ఫస్ట్‌ లుక్‌...

అలియాస్ రుక్మిణీ ఫస్ట్‌ లుక్‌ వీడియో విడుదలైన వెంటనే ఎవరు ఈమె అనే చర్చ మొదలైంది. అదే సమయంలో ఇంటర్నెట్‌లో ఈమె గురించి తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. ఈమె గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్‌ నదియాద్వాలా ఫ్యామిలీకి చెందిన ఆఫియా ప్రముఖ దర్శక నిర్మాత సాజిద్‌ నదియాద్వాలాకు స్వయానా మేనకోడలు. సాజిద్‌ సోదరి అఫీఫా నడియాద్వాలా సయ్యద్‌ కుమార్తె ఈ ఆఫియా. మొదటి నుంచి నటనపై ఆసక్తితో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఎన్నో నాటకాలు వేయడంతో పాటు, పదుల కొద్ది షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో లక్కీగా ప్రేమలు రీమేక్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి టాలీవుడ్‌లోనూ అవకాశం రావడానికి కారణం ఆమె అందం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, సోషల్‌ మీడియా వర్గాల వారు అంటున్నారు.

నాని సమర్పణలో నితిన్‌ హీరోగా...

నాని వంటి స్టార్‌ హీరో సమర్పణలో రాబోతున్న సినిమా కనుక 'అలియాస్ రుక్మిణీ' సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. దర్శకుడు మంచి కంటెంట్‌తో సినిమాను తీస్తే తప్పకుండా ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే బజ్ క్రియేట్‌ అయింది, తాజాగా వచ్చిన రుక్మిణీ పరిచయం వీడియో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కనుక అలియాస్ రుక్మిణీ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాలను ఈ అమ్మడు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆఫియా భవిష్యత్తులో స్టార్‌ హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమెను చూసిన చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇప్పటికే అలియాస్ రుక్మిణీ వీడియో చూసి ఉంటారు కదా, మీకు ఆఫియా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి.