Begin typing your search above and press return to search.

నానితో నితిన్.. ఏమిటీ ఈ రుక్మిణి కథ?

‘కోర్ట్’ లాంటి హిట్ తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్ ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దీప్తి గంట నిర్మాణం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అలియాస్ రుక్మిణి’.

By:  M Prashanth   |   3 Aug 2026 1:09 PM IST
నానితో నితిన్.. ఏమిటీ ఈ రుక్మిణి కథ?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ అనగానే డిఫరెంట్ అటెంప్ట్స్, క్రేజీ కాన్సెప్ట్స్ గుర్తుకొస్తాయి. ‘కోర్ట్’ లాంటి హిట్ తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్ ‘యూనానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దీప్తి గంట నిర్మాణం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అలియాస్ రుక్మిణి’. యంగ్ హీరో నితిన్ ఇందులో మెయిన్ లీడ్‌గా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది.

ఈ గ్లింప్స్ నాని వాయిస్ ఓవర్‌తో చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. “మురళీ హాయ్.. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ ఏ లాట్ అబౌట్ దిస్ స్టోరీ. దేని గురించి ఈ కథ?” అని నాని అడగ్గా, “ఈ కథ కృష్ణ గురించి అన్న” అని డైరెక్టర్ ఆన్సర్ ఇస్తారు. ఆ తర్వాత స్క్రీన్ పై “గరమ్ గోపాల్”, “ఆమెకు అతనంటే ఇష్టం”, “వ్రతం వెంకన్నా” లాంటి బోల్డ్ అండ్ మసాలా నవలల కవర్ పేజీలు ప్రత్యక్షమవుతాయి. ఆ నవలలన్నీ ‘రుక్మిణి’ అనే పేరు గల రచయిత రాసినట్లుగా చూపిస్తారు.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. “వన్ సెకండ్ మురళీ.. ఇది కృష్ణ కథ అన్నావ్, వ్రతం వెంకన్నా, గరమ్ గోపాల్, ఆమెకు అతనంటే ఇష్టం.. రచయిత రుక్మిణి. అసలు ఈ రుక్మిణి ఎవరు?” అని నాని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా టేబుల్ పై నిద్రపోతున్న నితిన్ కళ్లద్దాలు పెట్టుకుని లేచి, ప్రశాంతంగా కెమెరా వైపు చూస్తూ “నా భార్య.. మై వైఫ్” అని చెప్పడంతో రుక్మిణి పేరిట ఈ బోల్డ్ పుస్తకాలన్నీ రాస్తోంది హీరోనే అని క్లారిటీ వస్తుంది.

ఈ సినిమాలో నితిన్ లుక్ చాలా డిఫరెంట్ అండ్ నోవెల్‌గా ఉంది. స్పెక్స్ ధరించి ఒక మిడ్ రేంజ్ రచయితగా ఆయన ప్రెజెన్స్ చాలా సహజంగా కుదిరింది. ఇక గ్లింప్స్ చివర్లో నాని “ఐ లవ్ ది స్క్రిప్ట్.. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం?” అనడం సినిమా స్క్రిప్ట్ లో ఉన్న దమ్ముకు అద్దం పడుతోంది. నాని స్వయంగా ప్రెజెంట్ చేస్తుండటం, ఆయన టైమింగ్ అండ్ వాయిస్ ఓవర్ యాడ్ అవ్వడం ప్రాజెక్ట్ రేంజ్ ని పెంచేసింది.

విజాయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ వీడియోకి పర్ఫెక్ట్ మూడ్‌ని సెట్ చేసింది. కేవలం రొటీన్ మాస్ ఎలివేషన్లకు పరిమితం కాకుండా, కంటెంట్ డ్రివెన్ కథలను ఎంచుకునేందుకు నితిన్ సిద్ధపడటం మంచి విషయం. 'దండోరా' దర్శకుడి విజన్ కి యూనానిమస్ బ్యానర్ కాన్సెప్ట్ కాంబినేషన్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక రకమైన వింటేజ్ అండ్ బోల్డ్ పాయింట్‌ను కమర్షియల్ ఫార్మాట్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.