నితిన్ కొత్త హీరోయిన్ చాలా స్ట్రిక్ట్ అండోయ్..
యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా అలియాస్ రుక్మిణి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
By: M Prashanth | 13 Oct 2026 8:07 PM ISTయంగ్ హీరో నితిన్ కొత్త సినిమా అలియాస్ రుక్మిణి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్లూ ఆ సినిమాలో రుక్మిణి రోల్ లో ఎవరు నటిస్తున్నారనే సస్పెన్స్ ఉండగా.. రీసెంట్ గా దానికి చెక్ పడింది. బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ ను ఆ మూవీ హీరోయిన్ గా పరిచయం చేస్తూ మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే అందులో ఆమెను చూపించిన విధానం స్పెషల్ గా నిలిచింది. అందులో రుక్మిణి చాలా స్ట్రిక్ట్ టీచర్ గా కనిపిస్తోంది.
నితిన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి గంటా రూపొందిస్తున్నారు. దండోరా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడు ఆఫియా సయ్యద్ ను రుక్మిణిగా ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.
ఆమె ఓ స్కూల్ లో టీచర్ గా కనిపించారు. అయితే మామూలు టీచర్ లా కాకుండా.. విద్యార్థులను డిసిప్లైన్ లో పెట్టే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆమెను చూసి విద్యార్థులు భయపడుతుంటారు. ఆమెను ఏకంగా డెవిల్, హిట్లర్, హోంవర్క్ పోలీస్ అని అంతా పిలుచుకుంటారు. దీన్ని బట్టి రుక్మిణి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థులు వేసిన ఓ బొమ్మను చూసిన రుక్మిణి వెంటనే కోప్పడదు. దానిపై తన పేరు రాసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆ సీన్ ఆమె రోల్ ను ఇంట్రెస్టింగ్ గా చూపిస్తోంది. మరోవైపు పాఠశాలలో ఖాళీ సమయంలో పుస్తకాలు, నవలలు చదువుతూ కనిపిస్తున్నారు. బయటకు చాలా స్ట్రిక్ట్ గా కనిపించే రుక్మిణికి పుస్తకాలంటే ఇష్టమనే విషయాన్ని కూడా ఆ వీడియోలో చూపించారు. దీంతో ఆమె పాత్రలో మరో యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియోలో ఆఫియా సయ్యద్ లుక్, ఆమె యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అందంగా కనిపిస్తూనే స్ట్రిక్ట్ టీచర్ రోల్ కు సరిపోయేలా ఉంది. దీంతో తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే నితిన్ రోల్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ పాత్రను కూడా పరిచయం చేయడంతో సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది. సినిమాలో నితిన్ కూడా స్కూల్ లో టీజర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మరి స్ట్రిక్ట్ టీచర్ గా కనిపిస్తున్న రుక్మిణి, హీరో మధ్య ప్రేమ ఎలా మొదలవుతుందనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి. అయితే నితిన్ గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో ఆ మూవీపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. విజయ్ బుల్గానిన్ ఆ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అలియాస్ రుక్మిణి మూవీతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
