Begin typing your search above and press return to search.

జెన్ Z: 'రామాయణ'మంటే అందరికీ ఇంట్రెస్టే.. కానీ..

రామాయణం పేరు వినగానే చాలామందికి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి విన్న కథలు, చూసిన పాత్రలు మనసులో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నాయి.

By:  M Prashanth   |   26 Oct 2026 1:46 PM IST
జెన్ Z: రామాయణమంటే అందరికీ ఇంట్రెస్టే.. కానీ..
X

రామాయణం పేరు వినగానే చాలామందికి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి విన్న కథలు, చూసిన పాత్రలు మనసులో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నాయి. అందుకే ఆ ఇతిహాసాన్ని సినిమాగా తీస్తున్నారంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు దాన్ని సినిమా విజయంగా మార్చడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు తరతరాలుగా రామాయణాన్ని నమ్ముతున్న వారి మనోభావాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం.

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ' సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ ఖర్చుతో రెండు భాగాలుగా ఆ సినిమాను రూపొందిస్తున్నారు నమిత్ మల్హోత్రా. ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్ కూడా సినిమాకు వర్క్ చేస్తున్నారు. దీంతో సినిమా ఇండియన్ ఆడియన్స్ తోపాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

అయితే ఇక్కడే అసలు సవాల్ ఉంది. ప్రస్తుత యూత్ సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటోంది. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే భారీ యుద్ధాలు, అద్భుతమైన విజువల్స్, కొత్త ప్రపంచాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ప్రేక్షకులకు రామాయణాన్ని కొత్త అనుభూతి కలిగించేలా చూపించాలి. అదే సమయంలో కథలోని అసలు ఫీలింగ్ మర్చిపోకూడదు. గ్రాఫిక్స్, భారీ సెట్లు, యుద్ధ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించాలనుకుంటే సరిపోదు.

రాముడి పర్సనాలిటీ, సీతమ్మ పేషెన్స్, లక్ష్మణుడి కమిట్మెంట్, హనుమంతుడి డివోషన్, రావణుడి స్త్రెంత్ వెనుక ఉన్న అహంకారం.. ఇవన్నీ కథలో మెయిన్ ఎలిమెంట్స్. వీటిని స్క్రీన్ పై ఎలా చూపిస్తారన్నదే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. క్యారక్టైరేజేషన్స్, డైలాగ్స్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రామాయణం అనేది కేవలం ఒక సినిమా కథ కాదు. కోట్లాది మంది నమ్మకాలకు సంబంధించిన విషయం.

అందుకే దర్శకుడు నితీష్ తివారీపై బాధ్యత ఎక్కువగానే ఉంది. స్టోరీలోని మెయిన్ ఎలిమెంట్స్ ను కాపాడుతూనే, ప్రెజెంట్ జెనరేషన్ ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. రణబీర్ కపూర్ రాముడిగా ఎలా కనిపిస్తారు, యశ్ రావణుడిగా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తారు, సాయి పల్లవి సీత పాత్రకు ఎలా ప్రాణం పోస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ కూడా సినిమాకు స్ట్రెంత్స్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, మోడ్రన్ టెక్నాలజీ ఉన్నంత మాత్రాన మూవీ సక్సెస్ అవుతుందని చెప్పలేం. కథ ప్రేక్షకుల మనసుకు చేరాలి. రోల్స్ ఎమోషన్స్ నేచురల్ గా ఉండాలి. ముఖ్యంగా రామాయణంలోని వాల్యూస్ జెన్ జీకి చేరవేయగలగాలి. అయితే వాళ్లకు రామాయణంపై ఆసక్తి లేదని చెప్పలేం. కానీ వారికి కథను ఎలా చూపిస్తామన్నదే మెయిన్. పాత కథను కొత్తగా చెప్పడం ఒక ఎత్తయితే, దాని గొప్పతనాన్ని తగ్గించకుండా చెప్పడం మరో ఎత్తు. ఆ రెండింటినీ 'రామాయణ' ఎంతవరకు డీల్ చేస్తుందన్నది చూడాలి.