సోదరికి ఎమోషనల్ విషెస్ తెలిపిన నిషా అగర్వాల్.. ఆ జ్ఞాపకాలను పంచుకుంటూ!
ప్రముఖ హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టిన నిషా అగర్వాల్ తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటించి హీరోయిన్గా మంచి పేరు సొంతం చేసుకుంది.
By: Madhu Reddy | 20 Jun 2026 9:25 AM ISTప్రముఖ హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టిన నిషా అగర్వాల్ తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటించి హీరోయిన్గా మంచి పేరు సొంతం చేసుకుంది. అలా తొలిసారి 2017లో వచ్చిన ఏమైంది ఈవేళ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో అవంతిక పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత 2011లో సోలో అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది.
ఇక 2012లో ఇష్టం అనే సినిమా ద్వారా తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. మళ్లీ 2013లో సుకుమారుడు, సరదాగా అమ్మాయితో అనే చిత్రాలలో నటించింది. ఇక చివరిగా మలయాళంలో రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం కుటుంబంతోనే సమయాన్ని గడిపేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ బిజీగా మారిన ఈమె మరొకవైపు తన సోదరి కాజల్ అగర్వాల్ ఫ్యామిలీతో నిత్యం ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇకపోతే కాజల్ పుట్టినరోజు కావడంతో తన సోదరికి ఒక ఎమోషనల్ విషెస్ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ మేరకు కాజల్ అగర్వాల్ తో గడిపిన ప్రతి అద్భుతమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది. "నా సోదరికి, నా ప్రాణ స్నేహితురాలికి నా జీవితంలో గొప్ప వ్యక్తులలో ఒకరైన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి దశలో కూడా నాకు అండగా నిలిచావు. నాకు ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించావు. నన్ను అత్యధికంగా ప్రోత్సహిస్తూ నా మనసును అందరికంటే బాగా అర్థం చేసుకున్న వ్యక్తివి నువ్వే. నీ ప్రేమకు , నీ దయకు, నీ బలానికి అడుగడుగునా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఎప్పటికీ తెలియదు" అంటూ తన అక్క కాజల్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది నిషా అగర్వాల్ . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే.. లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో ఊహించని పాపులారిటీ అందుకుంది. అటు మగధీర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన కాజల్ అగర్వాల్ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ మంచి పేరు దక్కించుకుంది. ఇక వివాహం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇకపోతే ఈమె గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బికె 111 సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ మేరకు ఆమె పాత్రను రివీల్ చేస్తూ ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
