Begin typing your search above and press return to search.

న‌వ‌త‌రం భామ‌ల‌కు సీనియ‌ర్ బ్యూటీ ఛాలెంజ్!

వెర్స‌టైల్ యాక్ట‌ర్ నిరోష 90వ ద‌శ‌కంలో ఎన్నో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో న‌టిగా ఓ వెలుగు వెలిగారు.

By:  Srikanth Kontham   |   7 Aug 2025 5:00 AM IST
న‌వ‌త‌రం భామ‌ల‌కు సీనియ‌ర్ బ్యూటీ ఛాలెంజ్!
X

వెర్స‌టైల్ యాక్ట‌ర్ నిరోష 90వ ద‌శ‌కంలో ఎన్నో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో న‌టిగా ఓ వెలుగు వెలిగారు. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసిన న‌టి నిరోష‌. `ముద్దుల మావ‌య్య‌`, `మ‌హా జానికి మ‌ర‌దులు పిల్ల‌`, `నారీనారీ నడుమ మురారి`, ``కొబ్బరి బొండం` , `మధురానగరిలో` వంటి ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించారు. అప్ప‌ట్లోనే నిరోష‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. `సిందూర పువ్వు` త‌ర్వాత మ‌రింత ఫేమ‌స్ అయ్యారు. ఆ ఒక్క విజ‌యం నిరోష‌కు ఎన‌లేని క్రేజ్ ని తీసుకొచ్చింది.


అప్ప‌టి నుంచి ఆ సినిమా టైటిలే నిరోష ఇంటి పేరుగా మారిపోయింది. నాటి నుంచి 1995 వ‌ర‌కూ సిని మాలు చేసారు. ఆ త‌ర్వాత తెలుగులో రెండు..మూడు సినిమాల్లోనే న‌టించారు. అటుపై వెండి తెర‌కు ఒక్క సారిగా దూర‌మ‌య్యారు. కొత్త కొత్త క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు తెర‌పైకి రావ‌డంతో నిరోష‌కు అవ‌కాశాలు త‌గ్గాయి. కానీ తెలుగు టీవీ సీరియ‌ల్స్ తో మాత్రం ఇప్ప‌టికీ అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉన్నారు. అవ‌కాశం వ‌చ్చిన సీరియ‌ల్స్ లో న‌టిస్తూ తెలుగు అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. న‌టిగా మాత్రం నిరోష 100 సినిమాలు పూర్తి చేసారు.

ఇండ‌స్ట్రీలో ఇన్ని సినిమాలు చేస్తాన‌ని తానెప్పుడు భావించిన‌ట్లు గుర్తు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో నేటి జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌కు నిరోష ఓ స‌వాల్ విసిరారు. త‌న లా వంద సినిమాలు చేసే స‌త్తా ఏ న‌టికి ఉంది? ఇప్పుడు అన్ని అవ‌కాశాలు ఎలా వ‌స్తున్నాయి? ఇది ఏ న‌టికైనా పెద్ద టాస్క్ అవుతుందన్నారు. అలా వంద సినిమాలు చేస్తే వాళ్ల‌ను ఎంతో గొప్ప‌గా కీర్తించాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నిజ‌మే పాత జ‌న‌రే ష‌న్ లో న‌టీమ‌ణుల మ‌ధ్య పెద్ద‌గా కాంపిటీష‌న్ ఉండేది కాదు.

సినిమాల్లోకి వ‌చ్చే వారు త‌క్కువ‌గా ఉండటంతో రిపీటెడ్ గా వాళ్ల‌నే తీసుకునేవారు. నేడు ఇండ‌స్ట్రీలో అందుకు స‌న్నివేశం భిన్నంగా ఉంది. హీరోయిన్ల మ‌ధ్య పోటీ ఎలా ఉంది? క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల మ‌ధ్య కాంపిటీష‌న్ ఎలా ఉంది? అన్న‌ది క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. ప‌ట్టు మ‌ని ప‌ది సినిమా ఛాన్సులు రావ‌డం కూడా గ‌గ‌నంగా మారింది. అన్ని అవ‌కాశాలు రావాల‌న్నా? స‌క్సెస్ తో స‌రైన ట్రాక్ రికార్డు ఉంటే నే సాధ్య‌మ‌వుతుంది. మునుప‌టిలా ఇప్పుడు సౌత్ భామ‌ల‌కు వ‌చ్చిన అవ‌కాశాలు నార్త్ బ్యూటీల‌కు రాని స‌న్నివేశం క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.