హీరో హీరోయిన్ ఘాటైన లిప్ లాక్.. కావాలనే లీక్ చేశారా?
వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిన్న చిత్రం నిలవే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 12 Feb 2026 6:04 PM ISTవాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిన్న చిత్రం నిలవే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ కు ముందే ఆ సినిమా చర్చల్లో నిలవడానికి కారణం స్టోరీ కాదు, మ్యూజిక్ కాదు.. రీసెంట్ గా బయటకు వచ్చిన ఓ లిప్- లాక్ వీడియో. సినిమా స్పెషల్ షో సందర్భంగా హీరో- హీరోయిన్ల మధ్య సాగే దాదాపు ఒక నిమిషం నిడివి గల కిస్ సీన్ ఎవరో మొబైల్ లో రికార్డ్ చేసి నెట్టింట షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ఆ వీడియో లీక్ కావడంతో నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజంగా ఎవరో షూట్ చేసి లీక్ చేశారా? లేక మేకర్స్ కావాలనే పబ్లిసిటీ కోసం రిలీజ్ చేశారా? అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడాలంటే ఇలాంటి బోల్డ్ ప్రమోషన్స్ తప్పనిసరి అవుతున్నాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి స్టంట్స్ అవసరం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో టాలీవుడ్ లో ఇప్పటికే అర్జున్ రెడ్డి, RX 100 వంటి చిత్రాలు బోల్డ్ కంటెంట్ తో ముందుగానే యువతలో క్రేజ్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించాయి. సూపర్ హిట్స్ గా కూడా నిలిచాయి. అదే తరహాలో ఇప్పుడు నిలవే మూవీ టీమ్ కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచేందుకు తమ స్ట్రాటజీ ప్లాన్ చేసి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీమ్ రెస్పాండ్ అవ్వలేదు.
ఇక నిలవే సినిమా విషయానికి వస్తే.. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ.. సాయి కె. వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించారు. నిలవేతోనే ఆమె హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. కీలక పాత్రల్లో హర్ష చెముడు, సుప్రియ ఐసోలా నటిస్తున్నారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె. వెన్నం నిర్మిస్తున్నారు.
మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ సినిమా ప్రేమ, ఎమోషన్స్, యూత్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో రూపొందిందని మేకర్స్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్సెస్, సాంగ్స్, పోస్టర్స్ ద్వారా కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవాన్ని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న లిప్ లాక్ వీడియో సినిమా మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పబ్లిసిటీ పరంగా మూవీపై బజ్ తెచ్చినప్పటికీ, చివరికి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేది మాత్రం కంటెంట్ మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి నిలవే ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో? వీడియో ప్రభావం ఎంతవరకు ఉంటుందో? అన్నది వేచి చూడాలి.
