చీకటి గదిలో నిక్కీ తంబోలి కష్టమేంటి?
ప్రముఖ రియాలిటీ షో `ది 50` ద్వారా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న నటి నిక్కీ తంబోలి తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక రహస్య సందేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
By: Sivaji Kontham | 11 March 2026 11:25 PM ISTప్రముఖ రియాలిటీ షో `ది 50` ద్వారా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న నటి నిక్కీ తంబోలి తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక రహస్య సందేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తాజా పోస్ట్ లో ఎవరినీ ఉద్దేశించి నేరుగా అనకపోయినా కానీ..తను రాసిన పదాలు ఎంతో ఘాటుగా ఉన్నాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షోలో జరుగుతున్న అంతర్గత విభేదాల వల్లే నిక్కీ ఇలా స్పందించిందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా రియాలిటీ షోలలో కంటెస్టెంట్ల మధ్య ఉండే పోటీ, ఇగోలు, గొడవలు ఒక్కోసారి వ్యక్తిగత స్థాయికి చేరుతుంటాయి. `ది 50` షోలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తోటి కంటెస్టెంట్లతో ఉన్న వైరం కారణంగానే నిక్కీ ఈ రకమైన అసహనాన్ని వ్యక్తం చేసిందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ బ్యూటీ తన మనసులోని ఆవేదనను లేదా కోపాన్ని ఈ విధంగా పరోక్షంగా బయటపెట్టినట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిక్కీ తంబోలి ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ నిగూఢమైన సందేశం `షో`లో తనపై జరుగుతున్న కుట్రలను ఉద్దేశించినదా లేక మరేదైనా వ్యక్తిగత కారణమా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా ఈ ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
నిక్కీ తంబోలి కెరీర్ అప్‌డేట్స్..
నిక్కీ తంబోలి టాలీవుడ్ లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నిక్కీ ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా గడుపుతోంది. సినిమాల విషయానికి వస్తే .. తను నటించిన `కబ్జా 2` స్ట్రీమ్ కి రానుంది. కొన్ని బాలీవుడ్ మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసం ఆమె ప్రస్తుతం స్క్రిప్టులను ఎంచుకుంటోంది. దక్షిణాది సినిమాల్లో కూడా మళ్లీ మెరవడానికి నిక్కీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇక టీవీ కెరీర్ విషయానికి వస్తే.. నిక్కీకి రియాలిటీ షోలే పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. `బిగ్ బాస్ 14`, `ఖత్రోన్ కే ఖిలాడీ` వంటి షోలతో నిక్కీ ఇంటింటికీ పరిచయమైంది. ప్రస్తుతం `ది 50` రియాలిటీ షోలో తనదైన ముద్ర వేస్తూ టెలివిజన్ రంగంలో టాప్ సెలబ్రిటీగా కొనసాగుతోంది. గ్లామర్ షో చేయడమే కాకుండా.. తన బోల్డ్ మాటలతో కౌంటర్లతో టీవీ ఆడియన్స్‌ను అలరిస్తూ సోషల్ మీడియా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది.
