ఎగ్జోటిక్ లొకేషన్‌లో ఆది- నిక్కీ కపుల్ జాలీ లైఫ్
`రంగస్థలం` ఫేం ఆది పినిశెట్టి ప్రముఖ కథానాయిక నిక్కీ గర్లానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 14 Dec 2025 9:57 PM IST`రంగస్థలం` ఫేం ఆది పినిశెట్టి ప్రముఖ కథానాయిక నిక్కీ గర్లానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. తమ ప్రేమాయణం గురించి ఏనాడూ దాచలేదు. వారు బహిరంగంగా తమ డేటింగ్ గురించి వెల్లడించారు. నిశ్చితార్థం అనంతరం రెండు నెలల్లోనే పెళ్లితో ఒకటయ్యారు.
ఆది-నిక్కీ జంట 2025 మేలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చెన్నైలో కొద్దిమంది బంధుమిత్రులు, అతిథుల సమక్షంలో జరిగింది. ప్రీవెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ వేడుకలు హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగాయి. మార్చిలో నిశ్చితార్థం అనంతరం మేలో పెళ్లి వేడుకలు జరిగాయి. అలాగే ఈ అందమైన జంట పెళ్లి వేడుక ఫోటోలు ఇప్పటికే వెబ్ లో వైరల్ అయ్యాయి. తెలుగు చిత్రసీమ నుంచి ఆదికి అత్యంత సన్నిహితులైన సందీప్ కిషన్, నాని లతో పాటు కోలీవుడ్ హీరో ఆర్య కూడా ఈ పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు.
సామాజిక మాధ్యమాల్లో జోరుగా ఉండే నిక్కీ గర్లానీ తన భర్తతో సంతోషకర క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆది పినిశెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదికి హ్యాపీ బర్త్ డే చెప్పిన నిక్కీ విదేశీ వెకేషన్ నుంచి కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసారు. ``జీవితాంతం ఒకరికొకరు తోడుగా... నిజం చెప్పాలంటే.. ఇది ఇలా కాకుండా నేను వేరేలా కోరుకోను`` అంటూ ఆదితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తాజాగా షేర్ చేసారు. ఆది- నిక్కీ జంట అన్యోన్యత అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆది, నిక్కీ ఇద్దరూ గర్లానీ తెలుగు, తమిళం చిత్రాలలో నటించారు. నిక్కీ కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో కూడా నటించింది. మరోవైపు ఆది పినిశెట్టి అఖండ 2లో నటించాడు. ఈ సినిమాలో క్షుద్ర మాంత్రికుడి పాత్రలో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. థ్రిల్లర్ జానర్ లో డ్రైవర్ అనే చిత్రంలోను ఆది నటించాడు.
