Begin typing your search above and press return to search.

స్వ‌యంభు నుంచి అదిరిపోయే పోస్ట‌ర్

కార్తికేయ‌2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అందుకే ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవాల‌ని విప‌రీత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు నిఖిల్.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Jan 2026 6:12 PM IST
స్వ‌యంభు నుంచి అదిరిపోయే పోస్ట‌ర్
X

కార్తికేయ‌2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అందుకే ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవాల‌ని విప‌రీత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు నిఖిల్. ప్ర‌స్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలుండ‌గా వాటిలో స్వ‌యంభు మూవీ ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫిబ్ర‌వ‌రి 13న ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు.




యోధుడి లుక్ లో నిఖిల్

తాజాగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ను రిలీజ్ చేస్తూ విడుద‌ల తేదీ విష‌యంలో మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట‌ర్ లో నిఖిల్ యోధుడి లుక్ లో గుర్రాన్ని న‌డిపించుకుంటూ మ‌రో చేతిలో క‌త్తి ప‌ట్టుకుని క‌నిపించారు. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో న‌భా న‌టేష్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప‌లు విద్య‌లు నేర్చుకున్న నిఖిల్

అయితే ఈ మూవీ కోసం నిఖిల్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ కోసం నిఖిల్ యుద్ధ విద్య‌తో పాటూ గుర్ర‌పు స్వారీ ఇంకా చాలానే నేర్చుకున్నారు. పైగా ప్ర‌త్యేకంగా స్వ‌యంభు కోసం నిఖిల్ యుద్ధ‌వీరుడి లుక్ కోసం మేకోవ‌ర్ కూడా అయ్యారు. ప‌వ‌ర్‌ఫుల్ వారియ‌ర్ గా క‌నిపించ‌డం కోసం నిఖిల్ త‌న డైట్ ను కూడా మార్చుకుని ఎంతో కష్ట‌ప‌డ్డారు.

పిక్సెల్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై భువ‌న్, శ్రీక‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, సెంథిల్ కుమార్ డీఓపీగా పని చేస్తున్నారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌వ‌గా, ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, స్పానిష్‌, చైనీస్, అర‌బిక్ భాష‌ల్లో రిలీజ్ కానుంది.