స్వయంభూ సర్ ప్రైజ్.. ఈసారి లెక్కలు గట్టిగానే ఉండబోతున్నాయి!
అసలు విషయం ఏంటంటే ఈ ఫిబ్రవరి 11న ‘స్వయంభూ’ ఎపిక్ టీజర్ విడుదల కాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని ఒక క్రియేటివ్ వీడియో ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.
By: M Prashanth | 10 Feb 2026 10:26 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ప్రతీసారి థ్రిల్ చేస్తుంటాడు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న నిఖిల్, ఇప్పుడు ‘స్వయంభూ’ అనే భారీ పీరియడ్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తో మేకర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక అదిరిపోయే వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ వీడియోలో ఒక వారియర్ గెటప్ లో ఉన్న వ్యక్తి నేరుగా సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోవడం చూస్తుంటేనే క్యూరియాసిటీ పెరుగుతోంది. ఆ వారియర్ క్యారెక్టర్ ఎవరికైతే ఒక స్పెషల్ మెసేజ్ ఇస్తాడో, వారి రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉండబోతుందని అర్థమవుతోంది. నటి సంయుక్త మీనన్, నభానటేష్ వంటి స్టార్స్ కూడా ఈ వీడియోలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ డిఫరెంట్ ప్రమోషన్ స్టైల్ ఇప్పుడు యూత్ ను ఎట్రాక్ట్ చేసింది.
అసలు విషయం ఏంటంటే ఈ ఫిబ్రవరి 11న ‘స్వయంభూ’ ఎపిక్ టీజర్ విడుదల కాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని ఒక క్రియేటివ్ వీడియో ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కేవలం టీజర్ రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా, దీని లాంచ్ కోసం టీమ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ముంబైతో పాటు హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర నిఖిల్ మరోసారి తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ PCX స్క్రీన్ లో ఉదయం 9 గంటలకు టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని PVR సిటీ మాల్ లో గ్రాండ్ గా ఈ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ టీజర్ లో విజువల్స్ పక్కా హై రేంజ్ లో ఉంటాయట. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నిఖిల్ ఒక పవర్ ఫుల్ వారియర్ రోల్ లో కనిపిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఈ సినిమాలో ఒక రేంజ్ లో ఉండబోతున్నట్లు టాక్. ఇక నిఖిల్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నిఖిల్ ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. అందుకే ఈ టీజర్ లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఫిబ్రవరి 11న రాబోతున్న ఈ టీజర్ తో 'స్వయంభూ' అసలు హడావుడి మొదలవ్వబోతోంది. మరి నిఖిల్ ఈ పీరియడ్ డ్రామాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
