Begin typing your search above and press return to search.

నిఖిల్ 'స్వయంభు' బ్లాస్టింగ్ కి రెడీ..!

ఆల్రెడీ మార్చి మంత్ మిడిల్ నుంచి సినిమాల హంగామా ఉండబోతుంది ఏప్రిల్ 10న నిఖిల్ స్వయంభుతో దాన్ని మరింత కొనసాగించాలని ఫిక్స్ అయ్యారు.

By:  Ramesh Boddu   |   27 Jan 2026 12:18 PM IST
నిఖిల్ స్వయంభు బ్లాస్టింగ్ కి రెడీ..!
X

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ సినిమా తర్వాత తను చేస్తున్న రెండు భారీ సినిమాల అనౌన్స్ మెంట్ తో హైప్ తెప్పించాడు. అందులో ఒకటి చరణ్ నిర్మాణంలో ది ఇండియా హౌజ్ కాగా మరోటి స్వయంభు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఫిక్షనల్ స్టోరీ స్వయంభు. ఈ సినిమాను భరత్ కృష్ణమాచార్య డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఐతే రీసెంట్ గా నిఖిల్ అండ్ టీం సినిమా మేకింగ్ వీడియోతో సర్ ప్రైజ్ చేశారు.

ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్..

ఆ వీడియో తర్వాత స్వయంభు సినిమాపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. స్వయంభు సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. నభా నటేష్ కూడా మరో హీరోయిన్ గా చేస్తుంది. నిఖిల్ స్వయంభు సినిమా రిలీజ్ విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ముందు ఈ సినిమాను ఫిబ్రవరి 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఇప్పుడు ఆ డేట్ ని మార్చినట్టు తెలుస్తుంది.

స్వయంభు సినిమా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 13న పోటీలో చాలా సినిమాలు ఉండటం వల్ల సినిమాకు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి 13న రావాల్సిన స్వయంభు సినిమాను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. సమ్మర్ లో స్టార్ సినిమాల మధ్య నిఖిల్ స్వయంభు సందడి చేయబోతుంది.

నిఖిల్ లుక్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా..

ఆల్రెడీ మార్చి మంత్ మిడిల్ నుంచి సినిమాల హంగామా ఉండబోతుంది ఏప్రిల్ 10న నిఖిల్ స్వయంభుతో దాన్ని మరింత కొనసాగించాలని ఫిక్స్ అయ్యారు. నిఖిల్ స్వయంభు సినిమాలో నిఖిల్ లుక్స్ ఇంకా స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. నిఖిల్ స్వయంభు సినిమాను అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాతో పాటు ది ఇండియా హౌస్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. ఏప్రిల్ 10న నిఖిల్ స్వయంభు బ్లాస్టింగ్ సౌండ్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆ డేట్ దాకా వెయిట్ చేయాల్సిందే.

స్వయంభు సినిమా వీడియో చూస్తే ఈసారి నిఖిల్ మరింత పకడ్బందీ ప్లానింగ్ తో అదిరిపోయే కథతో వస్తున్నాడని అనిపిస్తుంది. సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ ప్లానింగ్ ఇంకా నేషనల్ లెవెల్ లో సినిమా ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న భారీ సినిమా అవ్వడంతో స్వయంభు మీద బీ టౌన్ ఆడియన్స్ కూడా మంచి అంచనాలతో ఉన్నారు.