'కిల్' డైరెక్టర్.. బాలీవుడ్ టు హాలీవుడ్!
అప్పుడు వాళ్లను ఎదిరించి అంతమొందించిన ఆర్మీ ఆఫీసర్ కథతో నిఖిల్ నగేష్ భట్ సినిమా తీశారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుని శభాష్ అనిపించుకున్నారు.
By: M Prashanth | 29 Aug 2025 12:00 PM ISTబాలీవుడ్ మూవీ కిల్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రైలు లోపలికి డబ్బుల కోసం చొరబడిన దుండగులు ప్రయాణికులను చంపేందుకు చూస్తారు. అప్పుడు వాళ్లను ఎదిరించి అంతమొందించిన ఆర్మీ ఆఫీసర్ కథతో నిఖిల్ నగేష్ భట్ సినిమా తీశారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుని శభాష్ అనిపించుకున్నారు.
ప్రత్యేక యాక్షన్ సీన్స్ కు గాను ప్రశంసలు కూడా అందుకున్నారు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం నిఖిల్ నగేష్ భట్.. నిర్మాత మురాద్ ఖేతానితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
నిఖిల్ ఇప్పుడు హాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఫేమస్ యూనివర్సల్ స్టూడియోస్ తో ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నారని సమాచారం. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని, ఇప్పుడు చివరి దశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అన్ని వివరాలు బయటకు రానున్నాయని వినికిడి.
గ్లోబల్ యాక్షన్ చిత్రంతో నిఖిల్ నగేష్ హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. హై ఆక్టేన్ యాక్షన్ మూవీగా పెద్ద ఎత్తున తీయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ ఇదేనట.
సినిమాలో స్టార్ హాలీవుడ్ నటులు యాక్ట్ చేయనున్నారని సమాచారం. వారు ఎవరనేది ఇంకా తెలియనప్పటికీ.. సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇండియన్ మూవీ లవర్స్ షాక్ అయ్యేలా క్యాస్టింగ్ ఉంటుందని టాక్. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నటుడు కూడా ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం.
అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కావొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే కిల్ లో తీవ్రమైన యాక్షన్ తో చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత.. నిఖిల్ హాలీవుడ్ డెబ్యూలో యాక్షన్ మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. నిఖిల్ హాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకుంటారో.. ఎంతలా మెప్పిస్తారో అంతా వేచి చూడాలి.
