100% లవ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా.. మరీ ఇంత చేంజ్ ఏంటి?
సాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Madhu Reddy | 20 Aug 2025 10:00 PM ISTసాధారణంగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ చైల్డ్ ఆర్టిస్టుల చుట్టూ కథను తిప్పి.. ఆ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. అలా ఒకటి రెండు సినిమాలతో భారీ పాపులారిటీ అందుకుని.. ఆ తర్వాత చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోతున్నారు. అనంతరం మళ్లీ ఇండస్ట్రీకి వచ్చి సడన్ గా గుర్తుపట్టలేనంతగా మారిపోయి, అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వాళ్లలో కొంతమంది సినీ రంగ ప్రవేశం చేసి.. హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కెరియర్ కొనసాగిస్తుంటే.. మరికొంతమంది వివిధ రంగాలలో సెటిల్ అవుతున్నారు.
రీ ఎంట్రీ ఇస్తున్న 100% లవ్ చైల్డ్ ఆర్టిస్ట్..
ఈ క్రమంలోనే 100% లవ్, గణేష్, మిర్చి లాంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నిఖిల్ అబ్బూరి. చిన్నప్పుడు చాలా బొద్దుగా.. ముద్దుగా.. ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ చిన్నారి అప్పట్లోనే తన డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించి.. సైమా, నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఒక పెద్దయ్యాక మళ్లీ ఇండస్ట్రీలోకి వద్దామనుకొని చదువుపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వివిధ విభాగాలలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమయ్యేసరికి ఈయన లుక్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నిఖిల్ అబ్బూరి..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా ద్వారా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో మరొకసారి వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు నిఖిల్ అబ్బూరి.#90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా వస్తున్న ఈ లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ లాంఛ్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇఈ ఈవెంట్లో మౌళి నిఖిల్ అబ్బూరిని అందరికీ పరిచయం చేశారు. దీంతో నిఖిల్ ఇప్పుడు వైరల్ గా మారిపోయారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అనిల్ రావిపూడి కూడా నువ్వేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. ఏది ఏమైనా ఒకప్పుడు చాలా బబ్లీగా కనిపించిన నిఖిల్ ఇప్పుడు బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మునుముందు హీరోగా అవకాశాలు కల్పించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు సినిమా అవకాశాలు తలుపుతడతాయో చూడాలి.
లిటిల్ హార్ట్స్ సినిమా విశేషాలు..
మౌళి హీరోగా , శివాని నాగారం హీరోయిన్ గా రాబోతున్న లిటిల్ హార్ట్స్ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. కాలేజ్ లైఫ్ , కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనుక తిరగడం, ఎంసెట్ ప్రిపరేషన్ ఇలా ప్రతిదీ యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా శివాని - మౌళి మధ్యలో లవ్ ట్రాక్ సినిమాకు ప్లస్ గా నిలవనుంది .
