Begin typing your search above and press return to search.

విశ్వక్, నిహారిక వీడియో ఫుల్ వైరల్.. ఇదెప్పుడూ బాసూ?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది

By:  M Prashanth   |   14 Oct 2025 3:24 PM IST
విశ్వక్, నిహారిక వీడియో ఫుల్ వైరల్.. ఇదెప్పుడూ బాసూ?
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. సింపుల్ గా చెప్పాలంటే.. ఓ ఊపు ఊపేస్తోంది. నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటిదో తెలియని ఆ వీడియోలో వారిద్దరూ సరదాగా, సిగ్గుపడుతూ కనిపించడంతో అంతా చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక గోడ పక్కన నిల్చున్నారు నిహారిక, విశ్వక్ సేన్. ఆ తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ మూసి ముసిగా నవ్వుకుంటారు. అంతే కాదు విశ్వక్ కు నిహారిక సరదాగా గిలిగింతలు పెడతారు. దీంతో ఆయన సిగ్గుతో నవ్వుతారు. ఆ రొమాంటిక్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఆ వీడియో చూస్తే ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన వీడియో అని స్పష్టంగా అర్థమవుతోంది. అయినప్పటికీ అప్పుడు వీడియో ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఇదెప్పుడు షూట్ చేశారని, వీరిద్దరికీ ముందే పరిచయం ఉందా అంటూ రకరకాలు కామెంట్లు పెడుతున్నారు.

మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. నిహారిక కాలేజీ రోజుల్లో ఆమెకు విశ్వక్ సేన్ సీనియర్. ఆ విషయాన్ని మెగా డాటర్ ఓ ఈవెంట్ లో తెలిపారు. దీంతో సీనియర్- జూనియర్ కలిపి షార్ట్ ఫిల్మ్ చేసి ఉంటారని పలువురు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు చక్కర్లు కొడుతుందని కామెంట్లు పెడుతున్నారు.

వీడియయోలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నిహారిక, విశ్వక్ సేన్ ఒక సినిమా చేస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు నటనకు కాస్త విరామం ఇచ్చి, నిర్మాతగా కొత్త ప్రాజెక్టులపైనే నిహారిక పూర్తి దృష్టి సారిస్తున్నారు. రీసెంట్ గా కమిటీ కుర్రోళ్లుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అదే సమయంలో విశ్వక్ సేన్.. ఇప్పుడు యంగ్ హీరోస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచారు. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాంతోపాటు మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. మరి ఫ్యూచర్ లో నిహారిక తో కలిసి సినిమా ఏమైనా చేస్తారేమో చూడాలి.