అదే కెరీర్ అంటే కాళ్లు విరగొడతామన్నారు!
సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తోంది. అయితే ఇన్ ప్లూయెన్సర్ గా మొదలైన నిహారిక ప్రయాణం సినిమా హీరోయిన్ వరకూ వస్తుందని తానెంత మాత్రం ఊహించలేదని తాజాగా తెలిపింది.
By: Srikanth Kontham | 10 Oct 2025 8:00 PM ISTసోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారి ప్రతిభ అక్కడికే పరిమితం కాలేదు. అక్కడ నుంచి హీరో లుగా...హీరోయిన్లుగా సినిమాలకు ప్రమోట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది నటీనటులు సినిమాల్లోకి అలా తెరంగేట్రం చేసిన వారే. ప్రియా ప్రకాష్ వారియర్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి సక్సెస్ అయిన వారే. తాజాగా `మిత్రమండలి`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోన్న నిహారిక కూడా సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ అన్న సంగతి తెలిసిందే.
సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తోంది. అయితే ఇన్ ప్లూయెన్సర్ గా మొదలైన నిహారిక ప్రయాణం సినిమా హీరోయిన్ వరకూ వస్తుందని తానెంత మాత్రం ఊహించలేదని తాజాగా తెలిపింది. యూట్యూబ్ ఛానల్ వచ్చిన కొత్తలో తాను ఛానల్ ను సరదాగా మొదలు పెట్టినట్లు తెలిపింది. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి మాద్యమాలు కూడా అలా మొదలు పెట్టిన వాటిగానే పేర్కోంది. అప్పటికే అవి జనాలకు కొత్త కావడంతో అలవాటు పడటానికి చాలా సమయం పట్టిందన్నారు. వాటి నుంచి ఆదాయం రావడానికి రెండు..మూడేళ్లు సమయం పట్టిందన్నారు.
అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో? ఇలాంటివన్నీ టైంపాస్ గా మాత్రమే చేయమని..అదే జీవితం అని అక్కడే కూర్చుని ఉండొద్దని సీరియస్ గానే చెప్పారుట. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాళ్లు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని ఓసందర్భంలో తల్లిదండ్రులు నేరుగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు గుర్తు చేసుకుంది. అప్పటికి వాటిపై తనకి కూడా పెద్దగా అవకాహన లేనప్పటికీ మెల్లగా ఒక్కోక్కటి తెసుకుంటూ అందులో ప్రావీణ్యం సంపాదించినట్లు గుర్తు చేసుకుంది. అలా మొదలైన తన ప్రయాణం సినిమాల వరకూ వస్తుందని ఎంత మాత్రం ఊహించలేదంది.
`మిత్రమండలి` సినిమా చేస్తోన్న సమయంలో అందులో హీరోయిన్ తానే? అని పలు సందర్భాల్లో భ్రమడిపడినట్లు చెప్పుకొచ్చింది. ఎవరికైనా జీవితంలో ఊహించనది జరిగినప్పుడు అలాంటి థ్రిల్ పీలవ్వడం సహజం. వైష్ణవి చైతన్య కూడా షార్టు ఫిల్మ్స్ చేసిన తెలుగు నటి. అక్కడ ఫేమస్ అవ్వడంతో యువ దర్శక, నిర్మాత సాయి రాజేష్ దృష్టిలో పడింది. దీంతో బేబి సినిమాలో బోల్డ్ రోల్ ఆఫర్ చేసాడు. పాత్ర నచ్చడంతో వైష్ణవి కూడా ఒకే చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో రాత్రికి రాత్రే అమ్మడి జీవితమే మారిపోయిన సంగతి తెలిసిందే.
